Ather Energy: నెల్లూరోళ్లకి శుభవార్త.. ఏథర్ ఈవీ ఔట్ లెట్ జిల్లాలోనే

-

Ather Energy Now Open New Outlet In Nellore: భారతదేశంలో సుప్రసిద్ధ విద్యుత్‌ స్కూటర్‌ తయారీదారు ఎథర్‌ ఎనర్జీ నేడు తమ నూతన రిటైల్‌ ఔట్‌లెట్‌ – ఎథర్‌ స్పేస్‌ను మాగుంట లేఔట్‌, నెల్లూరు వద్ద ఆర్కెడ్‌ ఆటో భాగస్వామ్యంతో ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఎథర్‌ ఎనర్జీ యొక్క నాల్గవ ఔట్‌లెట్‌ . మొదటి మూడు ఔట్‌లెట్‌లు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన 450 X మరియు 450 ప్లస్‌ లు టెస్ట్‌ రైడ్‌ మరియు కొనుగోలు కోసం ఎధర్‌ స్పేస్‌ వద్ద లభ్యమవుతాయి.

- Advertisement -

ఈ ఎథర్‌ స్పేస్‌ వినూత్నమైన యాజమాన్య అనుభవాలను అందించడంతో పాటుగా యజమానులకు పూర్తి స్థాయిలో సేవలు మరియు మద్దతును అందిస్తాయి. వినియోగదారులకు విద్యుత్‌ వాహనాల పట్ల అవగాహన కల్పించేలా దీనిని రూపకల్పన చేశారు. అదే సమయంలో ఇంటరాక్టివ్‌ ప్రాంగణంలో సమగ్రమైన అనుభవాలను ఎథర్‌ స్పేస్‌ అందిస్తుంది. ఎఽథర్‌ స్పేస్‌ ఇప్పుడు వినియోగదారులకు వాహనానికి సంబంధించి ప్రతి అంశాన్నీ తెలుసుకునే అవకాశం అందిస్తుంది. అదే సమయంలో పలు భాగాలను గురించి సమగ్రమైన అవగాహనను సైతం కల్పిస్తూ వాటిని ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం సందర్శించక మునుపే ఎథర్‌ ఎనర్జీ యొక్క వెబ్‌సైట్‌పై వారు టెస్ట్‌ రైడ్‌ స్లాట్స్‌ను సైతం బుక్‌ చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా రవ్నీత్‌ ఫొకేలా, ాఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, ఎథర్‌ ఎనర్జీ మాట్లాడుతూ ‘‘ ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణంగా వినియోగదారుల నుంచి డిమాండ్‌ ఉంది. విశాఖపట్నంలో మా మొదటి స్టోర్‌ను ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా స్టూటర్‌లకు అపూర్వమైన స్పందనను అందుకుంటూనే ఉన్నాము. అత్యున్నత పనితీరు కలిగిన విద్యుత్‌ స్కూటర్‌లకు మేము అసాధారణ ఆదరణ పొందాము. నెల్లూరు ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం ఈ డిమాండ్‌ను తీర్చనుంది మరియు ఎథర్‌ 450 X ను మరింత మందికి చేరువ చేయనుంది. అంతేకాదు, రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎథర్‌ను విస్తరించనున్నాము’’ అని అన్నారు.

ఆర్కేడ్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ తేజ్ మాట్లాడుతూ ” ఎథర్ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. సాంకేతికంగా అత్యాధునికమైన, అత్యున్నత పనితీరు కనబరిచే స్కూటర్లతో భారతీయ వాహన విద్యుత్ వాహన రంగాన్ని గణనీయంగా మారుస్తుంది. వినియోగదారుల లక్ష్యితమై ఉండటంతో పాటుగా నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యతనందించే బ్రాండ్లతో భాగస్వామ్యం చేసుకోవాలని ఓ గ్రూప్‌గా మేము ఎప్పుడూ ఎదురుచూస్తుంటాము. ఎథర్ ఎనర్జీ ఆ తరహా కంపెనీలలో ఒకటి. సంప్రదాయ స్కూటర్ల నిర్వహణ ఖర్చు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో నెల్లూరులోని వినియోగదారులు ఈవీలకు మారాలనుకుంటున్నారు. టియర్ 2 మార్కెట్‌ల పట్ల మాకున్న పరిజ్ఞానం తో పాటుగా ఎథర్ ఎనర్జీ యొక్క ఉత్పత్తి నాణ్యత , వినియోగదారులకు మహోన్నత అనుభవాలను అందించేందుకు మాకు తోడ్పడగలవని నమ్ముతున్నాము” అని అన్నారు.

చార్జింగ్‌ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంపై పెట్టుబడులు పెట్టిన అతి కొద్ది ఓఈఎంలలో ఎథర్‌ ఎనర్జీ ఒకటి. ఈ కంపెనీ 6 ఫాస్ట్‌ చార్జింగ్‌ పాయింట్లు, ఏథర్‌ గ్రిడ్స్‌ ను నెల్లూరులో ఏర్పాటుచేయడంతో పాటుగా మరో 8–10 చార్జింగ్‌ పాయింట్లను మార్చి 2023 నాటికి జోడించడానికి ఎథర్‌ ప్రణాళిక చేసింది. తద్వారా తమ చార్జింగ్‌ నెట్‌వర్క్‌ను మరింతగా బలోపేతం చేయనుంది. ఈ కంపెనీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 50కు పైగా ఎథర్‌ గ్రిడ్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. తమ ఫ్లాట్స్‌, భవంతులలో హోమ్‌ చార్జింగ్‌ సిస్టమ్స్‌ను వినియోగదారులు ఏర్పాటుచేసేందుకు అవసరమైన మద్దతును సైతం ఎథర్‌ ఎనర్జీ అందిస్తుంది.

ఎథర్‌ ఎనర్జీ 2022లో అసాధారణంగా వృద్ధిని కనబరిచింది. దేశవ్యాప్తంగా 60కు పైగా నగరాలలో 76 ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలను మరియు 750కు పైగా ఫాస్ట్‌ చార్జింగ్‌ పాయింట్లను కలిగి ఉంది. నవంబర్‌ నెలలో, భారతదేశ వ్యాప్తంగా 7234 యూనిట్లను ఎథర్‌ డెలివరీ చేసింది. అంతేకాదు ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 260% వృద్ధిని కనబరిచింది. ఈ కంపెనీ ఇటీవలనే తమ రెండవ తయారీ కేంద్రాన్ని హోసూరు వద్ద ప్రారంభించింది. తద్వారా వృద్ధి చెందుతున్న విద్యుత్‌ వాహనాల డిమాండ్‌ను తీర్చనుంది. ఈ నూతన కేంద్రం ద్వారా ఎథర్‌ అదనంగా సంవత్సరానికి 4లక్షల యూనిట్లను తయారు చేయగలదు.

భారీ బ్యాటరీ ప్యాక్‌ 3.7 కిలోవాట్‌ హవర్‌తో పాటుగా విశాలవంతమైన మిర్రర్స్‌, వెడల్పాటి టైర్లు కలిగిన నూతన ఎథర్‌ జెన్‌ 3 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మెరుగైన పనితీరు అందిస్తాయి. వినియోగదారుల డాటా ఆధారంగా, ఈ అప్‌గ్రేడ్స్‌ను వారి కొనుగోళ్లకు తగిన అత్యుత్తమ ధరను అందించే రీతిలో ఉన్నాయి. నూతన 450 X జెన్‌ 3 మరియు 450 ప్లస్‌ జెన్‌ 3 వృద్ధి చేసిన ట్రూ రేంజ్‌ వరుసగా 105 కొలోమీటర్లు మరియు 85 కిలోమీటర్ల శ్రేణిలో ఉంటుంది. ఈ స్కూటర్‌లో 7.0 అంగుళాల టచ్‌ స్ర్కీన్‌ ఇంటర్‌ఫేజ్‌,రీజెన్‌తో ఫ్రంట్‌, రియర్‌ డిస్క్‌ బ్రేక్స్‌ , 12 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌, బెల్ట్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ ఉన్నాయి.

ఎథర్‌ 450 X వాహన ధర ఫేమ్‌ –2 రివిజన్‌ తరువాత (ఎక్స్‌ షోరూమ్‌ ) 1,55,605 రూపాయలుగా ఉండగా, ఎథర్‌ 450 ప్లస్‌ ధర– 1,34,095 రూపాయలుగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు సుప్రసిద్ధ బ్యాంకులు అయిన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీలతో భాగస్వామ్యం చేసుకుని అతి సులభమైన ఫైనాన్సింగ్‌ అవకాశాలను వినియోగదారులకు అందిస్తుంది. ఎథర్‌ ఇప్పుడు తమ తాజా కార్యక్రమం ఎథర్‌ ఎలక్ట్రిక్‌ డిసెంబర్‌ ను ప్రారంభించింది. నెల రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమాల ద్వారా ఆకర్షణీయమైన ప్రయోజనాలు, ఫైనాన్సింగ్‌ అవకాశాలు,మార్పిడి ప్రయోజనాలు వినియోగదారులకు మొట్టమొదటిసారిగా లభ్యమవుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా విలువ ఆధారిత సేవలతో ఈవీ ప్రియులు అతి సులభంగా, సౌకర్యవంతంగా ఈవీలకు మారడం సులభమవుతుంది మరియు దేశంలో ఈవీ స్వీకరణ వేగవంతం చేయడమూ సాధ్యమవుతుంది.

Read Also: మాట్లాడట్లేదని 51 సార్లు స్క్రూడ్రైవర్‌తో పొడిచి పొడిచి దారుణంగా..!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...