మాజీ ఐఏఎస్ ప్రోబెషనరీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్(Puja Khedkar)కు కేంద్ర భారీ ఝలక్ ఇచ్చింది. తనను అధికారాల నుంచి తొలగించే అధికారం యూపీఎస్‌కు లేదన్న ఖేడ్కర్‌కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. యూపీఎస్ కాకుంటే తాను చేస్తా అన్నట్లు ఐఏఎస్ పదవి నుంచి ఆమెను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్(ప్రోబెషన్) రూల్స్, 1954 ప్రకారం పూజాపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ఆమె తొలగింపు తక్షణం అమల్లోకి వస్తుందని కూడా తెలిపింది. పూణెలో ట్రైనీ కలెక్టర్‌గా విదులు నిర్వర్తిస్తున్న పూజా అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పంచారన్న అంశాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని కూడా కేంద్రం ఆదేశించింది. ఈ దర్యాప్తు బాధ్యతనను యూపీఎస్సీకే అప్పజెప్పింది.
ఈ నేపథ్యంలోనే పూజా తిరిగి ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని యూపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ పత్రాలతో యూపీఎస్ పరీక్షను క్లియర్ చేసినట్లు వస్తన్న ఆరోపణలపై పూజా(Puja Khedkar) వివరణ ఇవ్వాలని కోరింది. ఆమె వివరణను బట్టి తమ తదుపరి చర్యలు ఉంటాయని కూడా అధికారులు తెలిపారు.