కీలక స్టెప్ వేసిన ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్

-

Future Generali India Life Insurance(FGILI): డైవర్స్ ఎబిలిటీ డే సందర్భంగా, ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూ రెన్స్ కంపెనీ లిమిటెడ్ (FGILI) 2021లో ఎఫ్­జి డైవర్స్ ఎబిలిటీ ఇంటర్న్‌­షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది ఒక గుణాత్మక కార్య క్రమంగా ప్రారంభించబడింది. ఇది ఇప్పుడు ఏటా అమలు చేయబడుతోంది. తప్పనిసరి రక్షణాత్మక కార్యక్రమం లేకుండా కూడా ఎవరైనా ఇతర ఇంటర్న్‌­లను నియమించుకునే విధం గానే విభిన్నమైన ఇంటర్న్‌­లను కంపెనీతో కలసి పని చేసేలా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ విశిష్ట కార్యక్రమం కింద, ప్రత్యేక సామర్థ్యం గల అభ్యర్థులను రెండు నెలల వ్యవధికి గాను ఇంటర్న్‌­షిప్ స్థానాలకు నియమించుకుంటారు. ప్రోగ్రామ్‌ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్‌ లో ఇంటర్న్‌ లు దీర్ఘకాలిక ఉద్యోగావకాశాలను పొందే వీలుంది.

- Advertisement -

విభిన్న అవసరాలు, నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు ఉపాధిని మెరుగుపరచడం, అందించడం అనే ఉద్దేశం తో డైవర్సిటీ ఇంటర్న్‌ షిప్ ప్రారంభించబడింది. అటువంటి కార్యక్రమాలకు అతిపెద్ద శత్రుత్వం టోకెనిజం (నామమాత్రపు ప్రాతినిథ్యం కల్పించడం). ఈ కార్యక్రమంలో మాత్రం ఈ తరహా నియామకాల్లో పలు విభా గాలు, విధులను చేర్చడం ద్వారా టోకెనిజంను తప్పించుకోవడానికి ఒక అవగాహనతో కూడిన ప్రయత్నం జరిగింది. ఇది వైకల్యాన్ని దాటి చూసే, విధులను నిర్వహించగల వ్యక్తి సామర్థ్యంపై దృష్టి సారించే నిజమైన దీర్ఘకాలిక, సుస్థిరమైన సంస్కృతిని సృష్టించడం లక్ష్యంగా జరుగుతోంది.

ఈ ప్రోగ్రామ్ మొదటి దశ డిసెంబర్ 2021లో ప్రారంభించబడింది, ఇక్కడ మొత్తం ముగ్గురు ఇతరేతర సామ ర్థ్యాలు గల (వికలాంగ) ఇంటర్న్‌ లను రెండు వర్గాల క్రింద నియమించారు – పాక్షిక శారీరక వైకల్యం మరి యు పాక్షిక శ్రవణ వైకల్యం. ప్రోగ్రామ్‌ను అమలు చేసే మొదటి రౌండ్‌లో, అర్హులైన అభ్యర్థులకు ఆహ్వానం (మెయిలర్) పంపబడింది. రెండవ రౌండ్‌లో మూడు విభాగాల – లాజికల్ రీజనింగ్, సంస్థ వ్యూహ ప్రణా ళికపై సందర్భోచిత తీర్పు, కంపెనీకి సంబంధించిన ప్రశ్నలు – పై క్విజ్‌లు ఉన్నాయి. మూడవ రౌండ్ ఫంక్షనల్ హెడ్ నిర్వహించే చివరి ఇంటర్వ్యూ.

ఈ సందర్భంగా హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ శ్వేత రామ్ మాట్లాడుతూ, ‘‘ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లోని వైవిధ్యం బహుళ కోణాలను కలిగి ఉంది. లింగం, వయస్సు, సంస్కృతి, చేరిక అనే 4 మూలస్తంభాలలో సమగ్రంగా పరిగణించబడుతుంది. వైకల్యంను డైవవర్సిబిలిటీ (వైవిధ్యత)గా వ్యవహరించేందుకు మేం ప్రాధాన్యం ఇస్తాం. ఇది వైవిధ్యానికి సంబంధించిన అంశం. వైవిధ్యభరితమైన ఇం టర్న్‌­షిప్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల ద్వారా, బలహీనతలకు అతీతంగా చూడడానికి, నిజమైన ప్రతిభను కలిగి ఉన్న నిజమైన ప్రతిభకు సాధికారత కల్పించడానికి అభివృద్ధి చెందిన సంస్కృతిని రూపొందించడం మా లక్ష్యం. వారి ప్రత్యేక సామర్థ్యాలను విధుల్లోకి తీసుకురావాలనే ఆకాంక్ష, సంకల్పం మాకు ఉన్నాయి. ప్రతిఒక్కరికీ భిన్నత్వంపై ఉండే అపోహలు/నమ్మకాలను నిర్వీర్యం చేయడానికి, సరిదిద్దడానికి కూడా ఇది ఒక చక్కటి అవకాశం. వారు వికలాంగులు కాదని, ఇతరేతర సామర్థ్యాలు కలవారని మేం విశ్వసి స్తున్నాం. ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో ఒక కమ్యూనిటీని నిర్మించా లనే ఆశతో ఇటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా రూపుదిద్దుకుంటాయి. ఇక్కడ మేం నిజమైన ప్రగతిశీల సంస్థగా మారడానికి ముందుకు సాగుతున్నప్పుడు అలాంటి వాటికి అద్దం పట్టేవారిగా, వారి పట్ల మరింత శ్రద్ధగా, సానుభూతితో ఉండవచ్చు’’ అని అన్నారు.

ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డిసెంబర్ 2022 నుండి ఎఫ్­జి డైవర్స్ ఎబి లిటీ ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్ రెండవ దశకు సంసిద్ధమైంది, ఇంటర్న్‌­షిప్ అవకాశాలను అందించడం లక్ష్యం గా పెట్టుకుంది. ఉపాధి అడ్డంకులను కూడా కంపెనీ తగ్గిస్తుంది. కంపెనీలో పని చేయడానికి ముందు సౌల భ్యం, పనిపై అవగాహన, కార్యాలయంలో వారి పట్ల సానుకూల స్పందనకు వీలు కల్పిస్తుంది. వినికిడి పరి కరాలు, వాయిస్ రికగ్నిషన్ స్పీచ్-టు-టెక్స్ట్ అప్లికేషన్‌లను అందజేస్తుంది. ఉద్యోగులకు నచ్చిన కమ్యూని కేషన్ మోడ్‌ను అందిస్తుంది. రోజువారీ పనితీరుకు సంబంధించి తగు చర్యలు తీసుకోబడతాయి. అన్ని సమయాల్లో ఇండక్షన్, గ్రీవెన్స్ కోసం మానవ వనరుల విభాగం ప్రతినిధి కేటాయించబడతారు.

వైకల్యాలున్న ఉద్యోగులు కార్యాలయంలో విజయం, ప్రేరణ, నైతికతకు దోహదపడే ప్రత్యేక నైపుణ్యాలు, దృక్పథాలు, అనుభవాలను తీసుకువస్తారు. కార్మిక శక్తిలో సరసమైన ప్రాతినిధ్యం గురించి అవగాహన, కార్యకలాపాల పెరుగుదలతో, విభిన్న సామర్థ్య ఇంటర్న్‌­షిప్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాలు విభిన్న నియామకాల భవిష్యత్తును ప్రస్తుత వాస్తవికతగా మార్చడానికి దోహదం చేస్తాయి.

మా విభిన్నమైన ఇంటర్న్‌­లు మా ఎంప్లాయ EVP ACE (జీవిత మార్గంగా చురుకుదనం, స్వంత ఉన్నతిని చార్ట్ చేసుకోవడం, ఎనేబిలింగ్ పని సంస్కృతిని అందించడం) సిద్ధాంతాలను వ్యక్తపర్చాలని మేం ఆశిస్తు న్నాం, ఎందుకంటే మేం వారి పట్ల, వారి ప్రతిభ పట్ల ఇతర సిబ్బందితో పోలిస్తే విభిన్నంగా చూడడం లేదు. ACE నిజంగా ఒక పరస్పరం బాధ్యత. వారు ఈ సూత్రాలను ఇముడ్చుకోవడం మాతో అర్థవంతమైన రీతిలో ప్రయాణంలో వారికి సహాయపడతాయని, అలాగే వారి వృత్తిపరమైన ఆశయాలకు రెక్కలు ఇస్తాయ ని మేం నమ్ముతున్నాం’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...