ప్రపంచ శ్రేణి వసతులతో జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌

-

G Square Eden Garden inaugurates new project in hyderabad: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్లాట్‌ ప్రమోటర్‌ జీస్క్వేర్‌ హౌసింగ్‌, హైదరాబాద్‌లో మొట్టమొదటి క్రీడా నేపథ్యపు లగ్జరీ ప్లాటెడ్‌ కమ్యూనిటీని బీఎన్‌ రెడ్డి నగర్‌ వద్ద ప్రారంభించింది. జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌ను(G Square Eden Garden) వ్యూహాత్మకంగా బీఎన్‌ రెడ్డి నగర్‌ వద్ద ప్రీమియం సౌకర్యాలతో గృహవసరాల కోసం తీర్చిదిద్దారు. విలాసవంతమైన సదుపాయాలతో కూడిన ప్లాటెడ్‌ కమ్యూనిటీల పట్ల ఆసక్తి కలిగిన వినియోగదారులకు దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దన జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌ అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో 484 ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్లాట్స్‌ ఉన్నాయి. వీటిని జీహెచ్‌ఎంసీ మరియు టీఎస్‌ రెరా అనుమతించాయి. ఎల్‌బీ నగర్‌ సర్కిల్‌ నుంచి కేవలం 5 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌, విజయవాడ హైవేకు ప్రవేశ కేంద్రంగా ఉంటుంది. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ పార్క్‌లలో ఒకటిగా గుర్తించబడిన ఆదిభట్లకు అతి సమీపంలో బీఎన్‌ రెడ్డి నగర్‌ ఉంది.

- Advertisement -

జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌ అత్యంత అందుబాటు ధరల్లోని విల్లా ప్లాట్స్‌గా 100కు పైగా ప్రపంచ శ్రేణి వసతులు, 40కు పైగా ప్రత్యేకమైన క్రీడా సదుపాయాలతో వస్తుంది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన కమ్యూనిటీగా బ్లాక్‌ టాప్‌ రోడ్స్‌, ప్రీమియం స్ట్రీట్‌లైట్స్‌, చక్కగా నిర్మించిన భూగర్భ విద్యుత్‌, నీటి సరఫరా వ్యవస్ధ, అత్యున్నత డ్రైనేజీ ఔట్‌లెట్‌ వ్యవస్ధ మరియు ఐదు సంవత్సరాల ఉచిత నిర్వహణను సైతం అందిస్తుంది.

జీస్క్వేర్‌ ప్రాజెక్టులన్నీ కూడా గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు. వీటిని వ్యూహాత్మకంగా పాఠశాలలు, కాలేజీలు, హాస్పిటల్స్‌, మెట్రోలు, మాల్స్‌, ఇతర సామాజిక మౌలిక సదుపాయాలకు దగ్గరగా తీర్చిదిద్దారు.

జీస్క్వేర్‌ ఈడెన్‌గార్డెన్‌ ప్రారంభం గురించి జీస్క్వేర్‌ హౌసింగ్‌ సీఈఓ ఈశ్వర్‌ ఎన్‌ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లో జీస్క్వేర్‌ హౌసింగ్‌ మొట్టమొదటి లగ్జరీ ప్రాజెక్ట్‌ను బీఎన్‌ రెడ్డి నగర్‌లో ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యుత్తమ కనెక్టివిటీ కలిగిన ప్రాంతమిది. విభిన్నమైన లగ్జరీ ఫీచర్లతో పాటుగా క్రీడా సదుపాయాలను సైతం వినియోగదారులకు ఇది అందిస్తుంది. నగరం లోపల తమ సొంత ప్లాట్‌లో తమ కలల ఇంటిని నిర్మించుకోవాలని కలలుగనే ప్రజలకు ఇది అత్యుత్తమ అవకాశంగా నిలుస్తుంది. తెలంగాణా ప్రభుత్వ నిర్ణయాల కారణంగా లాక్‌డౌన్‌ అనంతర కాలంలో అసాధారణ వృద్ధిని హైదరాబాద్‌ చూసింది. ఈ నూతన ప్లాట్‌ ప్రాజెక్ట్‌ నగరంలోని గృహ కొనుగోలుదారులు, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిదారులకు నూతన కోణం తెరువనుంది’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...