ఇదేం ఐడియారా బాబు.. పెళ్ళిలోనే వధువుతో అగ్రిమెంట్ చేసుకున్న వరుడు..

-

పెళ్ళి అయిందంటే స్వేచ్ఛ పోతుందని, స్నేహితులకు దూరంగా ఉండాలని, చిన్నచిన్న ఇష్టాలను వదులుకోవాలని చాలా మంది అంటుంటారు. మరికొందరు తమ స్నేహితుడికి పెళ్ళంటే ఇలాంటివి చెప్పే వాళ్లని భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కానీ తమిళనాడు(Tamil Nadu)లోని మైలాడుదులై జిల్లా సీర్గాళి సమీప ప్రాంతం తెన్‌పాడికి చెందిన ముత్తుకుమార్ మాత్రం తన విషయంలో అలా జరగకూడదని అనుకున్నారు అతని స్నేహితులు. అందుకే పెళ్ళి రోజే వధువుతో ఓ అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదెక్కి ఐడియారా బాబు అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు.

- Advertisement -

Tamil Nadu | ముత్తుకుమార్‌కు పవిత్ర అనే అమ్మాయికి సోమవారం వివాహమైంది. పెళ్ళి తర్వాత తమ స్నేహితుడు ముత్తుకుమార్ మళ్ళీ తమకు కలవడేమో అని, తమకు దూరమవుతాడే అని ఫ్రెండ్ అనుకున్నారు. అందుకు పరిష్కారంగానే.. పెళ్ళయిన తర్వాత తన స్నేహితులతో సమయం గడపడానికి ముత్తుకుమార్‌ను అనుమతిస్తానని, తమతో కలిసి టూర్లకు వెళ్లడాన్ని అడ్డుకోనని అంగీకరిస్తున్నట్లు పవిత్రతో అగ్రిమెంట్ చేయించుకున్నారు. అందుకోసం రూ.100 ప్రామిసరీ నోట్ తీసుకొచ్చి దానిపై సంతకం చేయించుకున్నారు. కాగా తన భర్త స్నేహితుల షరతులకు అభ్యంతరం తెలపకుండా పవిత్ర ఆ ప్రామిసరీ పేపర్‌పై సంతకం కూడా చేసింది.

Read Also: సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...