వైజాగ్ లేడీస్ కి గుడ్ న్యూస్.. చాలా వెరైటీస్ లో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్

-

Handloom Exhibition will start at Hotel Palm Beach In Vizag: ఈ శని మరియు ఆదివారాలలో టాటా ట్రస్ట్స్‌ క్రాఫ్ట్‌ ఆధారిత జీవనోపాధి కార్యక్రమంలో అత్యంత కీలకమైన అంతరన్‌ వద్ద ఇన్‌క్యుబేట్‌ చేయబడిన ఆర్టీషియన్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌లతో మొట్టమొదటిసారిగా సంభాషించే అవకాశం విశాఖపట్నం వాసులకు కలుగనుంది.

- Advertisement -

ఈ మూడు క్లస్టర్‌ లకు ప్రత్యేకమైన విభిన్న పద్ధతులలో చేనేత కారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన చేనేత చీరలు, వస్త్రాలు, దుపట్టాలలో ప్రదర్శన మరియు అమ్మకాలను హోటల్‌ పామ్‌ బీచ్‌ వద్ద 07 మరియు 08 జనవరి 2023 ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ప్రదర్శించనున్నారు.

అత్యంత విలాసవంతమైన గోపాల్‌పూర్‌ టస్సర్‌ సిల్క్స్‌ నుంచి ఒడిషాలోని మనియాబంధా నుంచి కాటన్‌ వెఫ్ట్‌ ఇకత్‌ టెక్స్‌టైల్స్‌ వరకూ మరియు ఆంధ్రా సొంతమైన వెంకటగిరి నేతకు చెందిన ఫైన్‌ కాటన్‌, సిల్క్‌ కాటన్‌, సిల్క్‌, ప్రత్యేక జామ్‌ధానీల వరకూ కళాకారులు నేరుగా ప్రదర్శించడంతో పాటుగా విక్రయించనున్నారు.

ఈ ఆర్టిషియన్లందరూ అంతరన్‌ లో భాగం. ప్రతి వీవ్‌ క్లస్టర్‌ సమగ్ర అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. అలాగని ఇది కేవలం డిజైన్‌ మరియు మార్కెటింగ్‌ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది సాంకేతిక, డిజైన్‌, నాణ్యత, ఎంటర్‌ప్రైజ్‌, మార్కెట్‌ డెవలప్‌మెంట్‌లో కూడా భాగం కావడంతో పాటుగా సస్టెయినబిలిటీపై ప్రధానంగా దృష్టి సారించి సంప్రదాయ క్రాఫ్ట్స్‌ను బలోపేతం చేసేందుకు తగిన చర్యలను తీసుకుంటుంది.

నాలుగు రాష్ట్రాలలోని ఆరు వీవింగ్‌ క్లస్టర్స్‌ – అస్సాం (కామ్రూప్‌ మరియు నల్బారీ), నాగాలాండ్‌ (దిమాపూర్‌), ఒడిషా (గోపాల్‌పూర్‌ మరియు మణియాబంధా), ఆంధ్రప్రదేశ్‌(వెంకటగిరి)లు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేయబడ్డాయి. ఇప్పటి వరకూ నేతలో డిజైన్‌ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటుగా విలువ చైన్‌లో ప్రతి అంశంలోనూ స్ధానిక సూక్ష్మ వ్యాపార సంస్థలకు తరగతి గది మరియు విద్యతో తగిన ప్రోత్సాహం అందిస్తుంది.

ఇప్పటి వరకూ 200కు పైగా ఆర్టిషియన్‌ వ్యాపారవేత్తలు (వీరు 2వేలకు పైగా ఆర్టిషియన్లకు తమ పరిజ్ఞానం అందించారు) అంతరన్‌ కార్యక్రమాలతో తీర్చిదిద్దబడ్డారు. ఈ కార్యక్రమాలను ఆరు క్లస్టర్లు– అస్సాంలోని కామ్రూప్‌, నల్బారీ , నాగాలాండ్‌లోని దిమాపూర్‌, ఒడిషాలోని గోపాల్‌పూర్‌ మరియు మణియా బంధా, ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటగిరిలో నిర్వహించింది. పరోక్షంగా మరింత మంది కళాకారులు ప్రయోజనం పొందారు.కొనుగోలుదారులకు ఈ క్లస్టర్ల పట్ల మరింత అవగాహన కలగడంతో పాటుగా అంతరన్‌ యొక్క స్ధిరమైన ప్రయత్నాల వల్ల ప్రతి క్లస్టర్‌ యొక్క వినూత్నత మరింతగా వెల్లడించబడి ప్రత్యేక మార్కెట్‌ ఏర్పడుతుంది.

భారతదేశంలో రెండవ అతిపెద్ద వృత్తిగా క్రాఫ్ట్‌ రంగం నిలుస్తుంది. వ్యవసాయ రంగం తరువాత దాదాపు 7 మిలియన్‌ల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయి. మరింత మందిని ఈ రంగం స్వీకరించే శక్తి కలిగి ఉండటంతో పాటుగా వలసలను కూడా అడ్డుకునే శక్తి కలిగి ఉంది. రెగ్యలర్‌ మార్కెట్లు కళాకారులకు స్ఫూర్తినందించడంతో పాటుగా తమ శతాబ్దాల నాటి క్రాఫ్ట్స్‌ కొనసాగించి, నగరాలకు వలస పోవడాన్ని అడ్డుకోగలవు.

వినూత్నమైన చేనేత వస్త్రాలను సొంతం చేసుకునే వినూత్న అవకాశాన్ని ఇది అందిస్తుంది. భారతదేశపు అత్యంత విలువైన కళా నైపుణ్యాలను కాపాడటానికి మరియు అత్యంత అందమైన ఉత్పత్తులను పొందేందుకు ఇది దోహదం చేస్తుంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...