నెల్లూరులో ప్రారంభమైన Honda BigWing షోరూమ్

-

Honda BigWing: హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఎస్‌ఐ) నేడు తమ ‘గో రైడింగ్‌’ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్తూ తమ ప్రీమియం బిగ్‌ బైక్‌ వ్యాపార విభాగం హోండా బిగ్‌వింగ్‌ ను నెల్లూరులో ప్రారంభించింది. ప్లాట్‌ నెంబర్‌ బీ3 మరియు బీ4, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, ఏకె నగర్‌, నెల్లూరు –524 004)

- Advertisement -

నెల్లూరులో బిగ్‌వింగ్‌ ప్రారంభం గురించి శ్రీ అత్సుషి ఒగాటా, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రెసిడెంట్‌–సీఈఓ హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘ హోండా బిగ్‌వింగ్‌ (హోండా యొక్క ప్రత్యేకమైన ప్రీమియం మోటర్‌సైకిల్‌ నెట్‌వర్క్‌)ను వినియోగదారులకు వైవిధ్యమైన లీనమయ్యే అనుభవాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించాము. నేడు, నెల్లూరు బిగ్‌వింగ్‌ను తెరువడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ నూతన ప్రీమియం ఔట్‌లెట్‌ ద్వారా మేము, హోండా యొక్క వినోదాత్మక, ప్రీమియం మోటర్‌సైకిల్స్‌ను నెల్లూరు లోని వినియోగదారులకు చేరువగా తీసుకురావడం లక్ష్యంగా చేసుకున్నాము. ఈ నూతన ప్రీమియం ఔట్‌లెట్‌ ద్వారా మా మిడ్‌ సైజ్‌ శ్రేణి మోటర్‌సైకిల్స్‌ను వారికి మరింత దగ్గరగా తీసుకురానున్నాం’’అని అన్నారు.

దేశవ్యాప్తంగా తమ చేరికను మరింత విస్తృతం చేస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా 100 నిర్వహణలోని బిగ్‌వింగ్‌ టచ్‌పాయింట్స్‌ ద్వారా వైవిధ్యమైన సిల్వర్‌ వింగ్స్‌ అనుభవాలను వినియోగదారులు పొందవచ్చు.

వైవిధ్యమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో

హోండా యొక్క ప్రీమియం మోటర్‌సైకిల్‌ రిటైల్‌ ఫార్మాట్‌కు అగ్రశ్రేణి మెట్రో నగరాలలో బిగ్‌ వింగ్‌ టాప్‌లైన్‌ మరియు ఇతర డిమాండ్‌ కేంద్రాలలో బిగ్‌వింగ్‌ నేతృత్వం వహిస్తున్నాయి. హోండా బిగ్‌ వింగ్‌ టాప్‌లైన్‌లో హోండా యొక్క సమగ్రమైన ప్రీమియం మోటర్‌సైకిల్స్‌ శ్రేణి ఉంది. దీనిలో నూతనంగా విడుదల చేసిన సీబీ300ఎఫ్‌, సీబీ 300ఆర్‌, హైనెస్‌ సీబీ350 మరియు దీని వార్షికోత్సవ ఎడిషన్‌, సీబీ350ఆర్‌ఎస్‌, సీబీ500ఎక్స్‌, సీబీ650ఆర్‌, సీబీ 650ఆర్‌, సీబీఆర్‌ 1000ఆర్‌ఆర్‌–ఆర్‌ ఫైర్‌బ్లేడ్‌ , సీబీఆర్‌ 1000 ఆర్‌ఆర్‌–ఆర్‌ ఫైర్‌బ్లేడ్‌ ఎస్‌పీ మరియు అడ్వెంచర్‌ టౌరర్‌ ఆఫ్రికా ట్విన్‌ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ మరియు ప్రతిష్టాత్మకమైన మోడల్‌ గోల్డ్‌ వింగ్‌టూర్‌ ఉంటాయి. బిగ్‌వింగ్స్‌ ఇప్పుడు భారతదేశంలో మిడ్‌ సైజ్‌ మోటార్‌సైకిల్‌ అభిమానులకు ఆనందం కలిగించనుంది.

ప్రీమియం అనుభవాలు

బ్లాక్‌ అండ్‌ వైట్‌ మోనోక్రోమాటిక్‌ నేపథ్యంతో ఆకట్టుకునేలా ఉన్న బిగ్‌వింగ్‌, తాము ప్రదర్శించే వాహనాలను పూర్తి వైభవంగా ప్రదర్శిస్తుంది. ఉత్పత్తికి సంబంధించి వినియోగదారులకు ఉన్న సందేహాలు తీర్చడం లేదా యాక్ససరీలను సుశిక్షితులైన, విజ్ఞానవంతులైన ప్రొఫెషనల్స్‌ బిగ్‌వింగ్‌ వద్ద అందిస్తారు. వెదకడం మొదలు కొనుగోలువరకూ ఈ ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, పూర్తిగా అంకితం చేసిన వెబ్‌సైట్‌ (www.HondaBigWing.in) సవివరమైన సమాచారం అందిస్తుంది. వెబ్‌సైట్‌పై ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం, వేగవంతమైన, సులభసాధ్యమైన, పారదర్శక బుకింగ్‌ అనుభవాలను వినియోగదారుల మునివేళ్లపై అందిస్తుంది. వాస్తవ సమయంలో వినియోగదారుల అభిప్రాయాలను ఒడిసిపట్టుకునేందుకు, హోండా బిగ్‌వింగ్‌ ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమ వేదికలపై లభ్యమవుతుంది.

వినియోగదారులకు భద్రత మరియు సౌకర్యానికి భరోసా అందిస్తూ, హోండా బిగ్‌వింగ్‌ ఇప్పుడు లీనమయ్యే డిజిటల్‌ అనుభవాలను తీసుకువస్తుంది. వర్ట్యువల్‌ వేదిక ద్వారా వినియోగదారులు పూర్తి వినోదాత్మక మోటర్‌సైకిల్‌ శ్రేణి, వైవిధ్యమైన శ్రేణి యాక్ససరీలు మరియు రైడింగ్‌ గేర్‌ సైతం సౌకర్యవంతంగా తమ ఇంటి వద్ద నుంచి పొందే అవకాశం అందిస్తుంది.

మమ్మల్ని ఇక్కడ చేరుకోండి :

హోండా బిగ్‌ వింగ్‌ నెల్లూరు సౌత్‌ – షోరూమ్‌ మరియు వర్క్‌షాప్‌ – ప్లాట్‌నెంబర్‌ బీ3 మరియు బీ4, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, ఏకె నగర్‌, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌, 524004

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...