ప్రపంచంలో ఏఐ(Artificial Intelligence)వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఉద్యోగులకు గడ్డుకాలం తప్పదని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం(IBM) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్ల కాలంలో కంపెనీలోని పలు విభాగాల ఉద్యోగాలకు ఏఐ టెక్నాలజీని వాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏకంగా 7,800 మంది ఉద్యోగుల స్థానంలో కృత్రిమ మేధను వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు ఐబీఎం(IBM) సీఈఓ అర్వింద్ కృష్ణ తెలిపినట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రచురించింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగానే ఇప్పటికే చాలా దిగ్గజ కంపెనీలు కృత్రిమ మేధ దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ఏఐ(AI) టెక్నాలజీపై పలువురు పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ నియంత్రణపై ప్రభుత్వాల జోక్యం అవసరమని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk), గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai), మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella) అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
Read Also: రాజమౌళి గారు.. మీరు ఆ సినిమా చేయండి: మహీంద్రా
Follow us on: Google News, Koo, Twitter