Lenovo 2 in 1 laptop: దిగ్గజ ల్యాప్‌టాప్ కంపెనీ Lenovo కొత్తగా టూ ఇన్ వన్ కన్వర్టబుల్ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Yoga 9i’. యోగా సిరీస్‌లో భాగంగా లేటెస్ట్ టెక్నాలజీతో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీని ప్రారంభ ధర రూ. 1,74,990. ల్యాప్‌టాప్ 14-అంగుళాల 4K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 13వ జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెసా-సర్టిఫైడ్ డిస్‌ప్లే HDR ట్రూ బ్లాక్ 500 టెక్నాలజీకి మరింత అదనపు హంగులను అందిస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60Hz, టచ్‌స్క్రీన్‌తో గరిష్టంగా 4K రిజల్యూషన్, 400 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సౌండ్‌ను కలిగి ఉంది.
ల్యాప్‌టాప్ 16GB RAM, 1TB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 75W బ్యాటరీతో, ఒక చార్జ్‌పై గరిష్టంగా 10 గంటల లైఫ్‌టైం అందించగలదని కంపెనీ పేర్కొంది. వీడియో కాల్‌ల కోసం, ల్యాప్‌టాప్ 2MP హైబ్రిడ్ ఫుల్-HD, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో వస్తుంది, ఇందులో స్మార్ట్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా ఉంది.
టూ ఇన్ వన్ కన్వర్టబుల్ Lenovo ల్యాప్‌టాప్ Storm Grey, Oatmeal అనే రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ల్యాప్‌టాప్ జనవరి 29 నుండి Lenovo అధికారిక ఆన్‌లైన్ స్టోర్, Croma, Amazon, Reliance Digital వంటి ఇతర ఇ-రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.