గుడ్ న్యూస్ : LIC లో రూ.30 వేలు కడితే రూ.22 లక్షలు వచ్చే ప్లాన్

-

LIC Introduces Dhan Sanchay Policy:లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ‘ధన్ సంచయ్’ పేరుతో పాలసీని అందిస్తుంది. ఇది గత ఏడాది జూన్ నెలలో ప్రారంభమైంది. పాలసీ 5 నుండి 15 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. లోన్ సౌకర్యంతో పాటు, పాలసీదారు మధ్యలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. డెత్ బెనిఫిట్స్ ఒకేసారి లేదంటే ఐదేళ్ల పాటు వాయిదాల్లో చెల్లిస్తారు. ఇది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, సేవింగ్ ప్లాన్. దీనిలో నాలుగు రకాల పెట్టుబడి ఆప్షన్స్ ఉంటాయి. A, B ఎంపికలలో, హామీ మొత్తం కనీసం రూ. 3,30,000, ఆప్షన్ C లో రూ. 2,50,000, D లో రూ. 22,00,000.

- Advertisement -

Dhan Sanchay Policy: ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయస్సు 3 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి A, Bలకు 50 సంవత్సరాలు, Cకి 65 సంవత్సరాలు, D పరిమితి 40 సంవత్సరాలు. ఈ పాలసీకి కనీస ప్రీమియం సంవత్సరానికి రూ. 30,000. పెట్టుబడిదారులు 5, 10 లేదా 15 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌ కింద మినిమం సమ్‌ అష్యూర్డ్‌ రూ.2.5 లక్షల నుంచి 22 లక్షల వరకు ఉంటుంది. ఈ పాలసీ గురించిన పూర్తి వివరాల కోసం దగ్గరలోని LIC బ్రాంచులో లేదా ఏజెంట్‌ను సంప్రదించగలరు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...