అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకి Matter Electric Bike

-

Matter unveils india’s first geared Electric bike: ఆవిష్కరణ ఆధారిత సాంకేతిక స్టార్టప్‌, మ్యాటర్‌ తమ భావితరపు ఈవీలను మరియు కాన్సెప్ట్‌లను ఆటో ఎక్స్‌పో 2023 వద్ద ప్రదర్శించింది.అభివృద్ధి చెందుతున్న భారతీయ యువత అవసరాలకు తగినట్లుగా ,ఈ కంపెనీ ఇప్పుడు సాంకేతిక, ఇంజినీరింగ్‌, డిజైన్‌ అవసరాలకు సరిపోయేలా వైవిధ్యమైన ఉత్పత్తులు మరియు పర్యావరణ అనుకూల పరిష్కారాలతో భారతదేశాన్ని పూర్తి విద్యుత్‌ వాహన భవిష్యత్‌ దిశగా తీసుకువెళ్లడానికి తమ నిబద్ధతను చాటి చెబుతుంది.

- Advertisement -

భారతదేశంలో మొట్టమొదటిసారిగా గేర్డ్‌ విద్యుత్‌ మోటర్‌బైక్‌ , 6కిలోవాట్‌ వేరియంట్‌ మ్యాటర్‌ బైక్‌. దీనిని వినూత్నమైన మ్యాటర్‌ బైక్‌ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించడంతో పాటుగా రెండు గంటల లోపు వేగవంతమైన చార్జింగ్‌ సదుపాయాలతో మెరుగైన శ్రేణి అందిస్తుంది. ఈ నూతనంగా ఆవిష్కరించిన బైక్‌ ధర, భారతదేశపు మార్కెట్‌లో ముందస్తు ఆర్డర్లు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేది త్వరలోనే కంపెనీ వెల్లడించనుంది.

ఇటీవలి కాలంలో విద్యుత్‌ వాహన పరిశ్రమను చక్కగా ఆదరిస్తున్నారు. అయితే, విప్లవాత్మక ఆవిష్కరణలు, వైవిధ్యమైన ఉప విభాగాల పరంగా ఉత్పత్తి వైవిధ్యత మాత్రం ఇంకా వెలుగుచూడాల్సి ఉంది. సుదీర్ఘకాలంగా మోటర్‌బైక్‌ విభాగంలో ఉన్న ఈ అంతరాలను పూరించడం మ్యాటర్‌ లక్ష్యంగా చేసుకుంది. ఈ గ్రూప్‌ స్థిరంగా ఆవిష్కరణలపై పనిచేయడంతో పాటుగా విప్లవాత్మక మార్పులను భారతదేశంలో తీసుకురావడానికి కృషి చేస్తుంది. మరీముఖ్యంగా రైడర్‌ల వైవిధ్యమైన అవసరాలు తీర్చడం లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా ప్రవేశ దశ, ఎగ్జిక్యూటివ్‌, ప్రీమియం దశ మార్కెట్‌ అవసరాలను తీర్చనుంది.

ఈవీలకు సమూలమైన మార్పులను తీసుకురావాలనే లక్ష్యంతో, మ్యాటర్‌ ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేయడంతో పాటుగా ఈ కంపెనీ గత సంవత్సర కాలంగా రెండు సాంకేతిక నేపధ్యాలపై తీవ్రంగా కృషి చేస్తుంది. అవి కాన్సెప్ట్‌ ఈఎక్స్‌ఈ మరియు కాన్సెప్ట్‌ యుటి. ఈ రెండూ కూడా మూసధోరణులను అడ్డుకోవడంతో పాటుగా ఈవీల ద్వారా భారతదేశంలో మొబిలిటీ వ్యవస్ధను సమూలంగా మార్చనుంది.

ఈ సందర్భంగా మ్యాటర్‌ ఫౌండర్‌ , గ్రూప్‌ సీఈఓ మొహాల్‌ లాల్‌భాయ్‌ మాట్లాడుతూ ‘‘ఆటో ఎక్స్‌పో 2023 వద్ద మా నూతన సాంకేతిక ఆఫరింగ్స్‌ను ప్రదర్శిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మ్యాటర్‌ వద్ద మేము 22 వ శతాబ్దపు సాంకేతికతలను నేడే సస్టెయినబల్‌ శక్తితో సృష్టించగలమని నమ్ముతుంటాము. ఈ లక్ష్యానికి అనుగుణంగా, మేము స్ధిరంగా వినియోగదారుల లక్ష్యిత, సాంకేతిక ఆధారిత ఉత్పత్తులను మరియు వినూత్నమైన పరిష్కారాలను మొబిలిటీ, విద్యుత్‌ విభాగాలకు అందించనున్నాము. ఈ ఆవిష్కరణలతో, మోటర్‌బైక్స్‌ విభాగంలో అన్ని అంశాలనూ కవర్‌ చేయనున్నాము. నూతన సాంకేతికతల ఆవిష్కర్తగా, మా లక్ష్యం ఎప్పుడూ కూడా మూసధోరణులను అడ్డుకోవడం మరియు భారతదేశంలో విద్యుత్‌ మోటర్‌బైక్‌లను వినియోగిస్తున్న తీరును గణనీయంగా మార్చడం. పూర్తి పర్యావరణ అనుకూలమైన భావి తరపు పరిష్కారాలను ప్రతి రైడర్‌కూ అందించేందుకు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని అన్నారు.

మ్యాటర్‌ మోటర్‌ బైక్‌

మ్యాటర్‌ – బైక్‌ను భారతదేశంలో భారతదేశం కోసం భావితరపు ఫీచర్లు మరియు అనుభవాలతో తీర్చిదిద్దారు. మోటర్‌ సైక్లింగ్‌ స్ఫూర్తిని మిళితం చేసుకున్న మ్యాటర్‌ – బైక్‌ రైడర్‌కు సాటిలేని స్పోర్ట్‌ బైక్‌ సవారీ అనుభవాలను అందించడంతో పాటుగా భావి సాంకేతికత అనుభవాలనూ అందిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి గేర్డ్‌ ఈవీ మోటర్‌బైక్‌ ఇది. దీనిలో హైపర్‌ షిప్ట్‌ గేర్‌బాక్స్‌తో భారతదేశలో మొట్టమొదటి లిక్విడ్‌ కూల్డ్‌ ద్వి చక్ర ఈవీ పవర్‌ట్రైన్‌ను మిళితం చేశారు. ఇది బై –ఫంక్షనల్‌ క్లాస్‌ డీ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌, వినూత్నమైన బాడీ మౌంటెడ్‌ ఫ్రంట్‌ బ్లింకర్‌ లైట్స్‌, స్ల్పిట్‌ శైలి ఎల్‌ఈడీ టైల్‌ ల్యాంప్స్‌ మరియు ప్రొగ్రెసివ్‌ రియర్‌ బ్లింకర్స్‌ కలిగి ఉంటాయి. దీనిలోని 7 అంగుళాల టచ్‌ స్ర్కీన్‌లో 4జీ కనెక్టివిటీ, బ్లూ టూత్‌, వై–ఫై, ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉండటంతో పాటుగా కాల్స్‌, మ్యూజిక్‌, నేవిగేషన్‌కు మరియు అత్యాధునిక రైడ్‌ స్టాట్స్‌కు సైతం మద్దతు అందిస్తుంది. ఆన్‌బోర్డ్‌ 5యాంప్‌ చార్జర్‌ రోడ్డు పై ఎక్కడైనా మీ బైక్‌ చార్జ్‌ చేసేందుకు అనుమతిస్తుంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...