Signify introduced Philips O-Bulb and Hexa-Bulb in India: లైటింగ్‌లో ప్రపంచ అగ్రగామి అయిన సిగ్నిఫై (Euronext: LIGHT) భారతదేశంలో ఫిలిప్స్ హెక్సా-బల్బ్, O -బల్బ్ అని పిలువబడే రెండు ప్రత్యేక ఆకారపు ఎల్ఈడీ బల్బులను ఆవిష్కరించిం ది. షట్కోణ, వృత్తాకార ఆకారపు బల్బులు మీ ఇండోర్ స్పేస్‌కు సొగసైన టచ్‌ని అందించడానికి తోడ్ప డుతాయి. మీరు ఎవరినైనా కలుసుకున్నప్పుడు లేదా మీ ప్రియమైన వారితో కొంత ప్రశాంతంగా గడిపే సమయాల్లో పరిపూర్ణ వాతావరణాన్ని సృష్టించడానికి అలంకరణ లైట్లుగా వీటిని ఉపయోగించవచ్చు.
ఈ రెండు బల్బులు కూడా సాధారణ ప్లగ్-ఎన్-ప్లే రూపాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఇప్పటికే ఉన్న ఎల్ఈ డీ బల్బ్ సాకెట్‌లలో సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చు. మీ కళ్లకు సౌకర్యంగా ఉండేలా రూపొందించబడిన ఈ బల్బులు సాధారణ గుండ్రని ఆకారపు ఎల్ఈడీ బల్బులతో పోలిస్తే విస్తృత కాంతిని అందిస్తాయి.
ఈ ఆవిష్కరణపై సిగ్నిఫై (దక్షిణాసియా) సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ జోషి మాట్లాడుతూ, “లైటింగ్ లో గ్లోబల్ లీడర్‌గా, సిగ్నిఫై ఎల్లప్పుడూ ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉంది. భారతదేశంలో T-బల్బ్ కేటగిరీ ని విజయవంతంగా సృష్టించిన తర్వాత, వినూత్న ఆకృతిలో ఎల్ఈడీ బల్బులు -ఫిలిప్స్ హెక్సా-బల్బ్, O – బల్బ్ లతో మా సరికొత్త శ్రేణిని ప్రారంభించడం పట్ల మేం సంతోషిస్తున్నాం. ఇవి మీ కళ్లకు సున్నితపు వెలుగును అందిస్తాయి. మా ఐ కంఫర్ట్ సాంకేతికత కారణంగా ఇది సాధ్యపడింది. అంతేగాకుండా వీటి సొగసైన డిజైన్ మీ ఇంటి ఇంటీరియర్‌లను మరింత ఉన్నతస్థాయికి చేర్చుతుంది’’ అని అన్నారు.
ఫిలిప్స్ హెక్సా-బల్బ్ 16W, 1500 ల్యూమన్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఫిలిప్స్ O -బల్బ్ ప్రస్తు తం 20W, 1800 ల్యూమెన్స్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. రెండు బల్బులు చల్లని మరియు వెచ్చ ని తెలుపు రంగులలో, అన్ని చిన్న, పెద్ద ఫార్మాట్ రిటైల్ స్టోర్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో వరుసగా ₹999/-, ₹1199/- MRP లకు అందుబాటులో ఉన్నాయి.