Sitrang Cyclone :తెలుగు రాష్ట్రాలకు సిత్రాంగ్ తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని.. ఈ ప్రభావం కారణంగా అక్టోబర్ 20 నాటికి సిత్రాంగ్ తుఫాన్ (Sitrang Cyclone) తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్‌గా మార్పు చెందుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సిత్రాంగ్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా వర్షాలు కురువనున్నాయని వెల్లడించారు. నవంబరులో ఏర్పడే వాయుగుండాలు తుపానుగా బలపడేందుకు అవకాశముందని వివరించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలల్లో భారీ వానలు ముంచెత్తాడంతో వరదల కారణంగా చాలా ప్రాంతాలు అల్లాడుతున్న విషయం తెలిసిందే.. అటువంటి సమయంలో మరో ముప్పు ఉనట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సిత్రాంగ్ రూపంలో మరింత వరద బీభత్సం ఉండే అవకాశం ఉందని అలర్ట్‌గా ఉండాలని సూచిస్తోంది.