కొన్ని కలలు నెరవేరకపోవడమే మంచిది: ఆనంద్ మహీంద్ర

-

కనే ప్రతి కలను నెరవేర్చుకోవాలని ప్రతి మనిషి తాపత్రయపడతాడు. కానీ తాజా ఈ కలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని కలలు నెరవేరకపోవడమే మంచిదని ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఆసక్తికర విషయాలను, వీడియోలను షేర్ చేసుకుంటూ ఉండటం ఆయన హాబీ అని చెప్పుకోవచ్చు. తాజాగా ఆయన కలను ఉద్దేశించి తన అభిప్రాయాన్ని ఆసక్తికరంగా వెల్లడించారు. దీంతో పాటుగా ఆయన ఒక వీడియోను కూడా షేర్ చేశారు. అందులో ఓ మహిళ ఓ విలాసవంతమైన నౌకలో సాహసమే చేసింది. ఎన్నో అడుగుల ఎత్తు ఉండే నౌక నుంచి ఆమె సముద్రంలోకి డైవ్ చేసింది. చిన్న పొరపాటు జరిగినా ఆమె ప్రాణానికే ప్రమాదం వాటిల్లి ఉండేది. ఈ వీడియోపైనే ఆయన స్పందించారు. ఈ పోస్ట్‌పై కొన్ని పనులు ప్రయత్నించడం కంటే గమనించడమే మేలంటూ రాసుకొచ్చారు.

- Advertisement -

‘‘నేను ఈరోజు ఓ కల కన్నాను. ఓ విలాసవంతమైన నౌకలో ఈ రకమైన డైవ్‌ని ఎలా చేయాలో నేర్చుకోవాలని భావించా. అయితే.. కొన్నిసార్లు కలలు(Dreams).. కలలుగానే ఉంటే బాగుంటుంది. వాటిని దూరం నుంచి గమనించడమే మేలు’’ అంటూ రాసుకొచ్చారు. ‘‘నేను మాత్రం ఇలాంటి కల చూడాలనుకోవడం లేదు. ఇది చాలా భయంగా ఉంది. ఇలాంటి సాహసం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ.. పొరపాటు జరిగితే.. అంతే సంగతులు’’ అని అని ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) రాసుకొచ్చారు.

Read Also: గంభీర్ తలొగ్గే వ్యక్తి కాదు: రోహిత్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీడీపీలో చేరతా.. అభివృద్ధికి కృషి చేస్తా: తీగల కృష్ణారెడ్డి

త్వరలోనే టీడీపీలో చేరనున్నానంటూ మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy)...

మేమేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు: ఓవైసీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలపై ఎంఐఎం అధినేత ఓవైసీ(Asaduddin Owaisi)...