భారతదేశ వ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించిన స్టెల్లా మోటో

-

Stella Moto has announced its expansion plans across India: మైక్రో మొబిలిటీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్‌లలో ఒకటైన స్టెల్లా మోటో (జైద్కా గ్రూప్‌ సంస్థ), విద్యుత్‌ స్కూటర్‌ వృద్ధిని ఒడిసిపట్టుకునేందుకు నేడు భారతదేశ వ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. ఈ కంపెనీ తమ కార్యకలాపాలను కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ మరియు ఢిల్లీలో విస్తరించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటుగా టియర్‌2, టియర్‌ 3 మార్కెట్‌లలో సైతం తమ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి సారించింది.

- Advertisement -

ఈ కంపెనీ తమ డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను సైతం విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్రాండ్‌ ఇప్పుడు సబ్‌–డీలర్స్‌ ను సైతం లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలు విస్తరించనుంది. డీలర్లను ఆకర్షించేందుకు, స్టెల్లా మోటో ఇప్పుడు దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేయడంతో పాటుగా మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌ చేసింది. అదే రీతిలో పార్టనర్‌ ప్రోగ్రామ్‌ సైతం ఇది ప్రారంభించింది. దీనిద్వారా తమ వ్యాపార భాగస్వాములకు శిక్షణ, సర్టిఫికేషన్స్‌, మార్కెటింగ్‌ను సైతం అందించి విజయవంతమైన విద్యుత్‌ స్కూటర్‌ వ్యాపారాన్ని ఏర్పాటుచేసేందుకు తోడ్పడనుంది.

ఈ విస్తరణ ప్రణాళికలను గురించి స్టెల్లా మోటో(Stella Moto) సీఈఓ–ఫౌండర్‌ నకుల్‌ జైడ్కా మాట్లాడుతూ ‘‘వ్యూహాత్మకంగా స్టెల్లా మోటో నెట్‌వర్క్‌ విస్తరించనున్నాము. మా వినియోగదారులు , డీలర్ల నుంచి లభిస్తున్న ప్రోత్సాహానికి ప్రతీకగా మా విస్తరణ ఉంటుంది. నేడు, స్టెల్లా అతి స్వల్పకాలంలోనే, సేల్స్‌, పోస్ట్‌ సేల్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయనుంది. విస్తరించిన నెట్‌వర్క్‌ కార్యక్రమాలతో డిమాండ్‌ను తీర్చడంతో పాటుగా బ్రాండ్‌ పట్ల వినియోగదారుల నమ్మకాన్ని సైతం పెంపొందిచుకోగలము’’ అని అన్నారు.

స్టెల్లా మోటో ఇటీవలనే ఆర్‌టీఓ అనుమతించిన విద్యుత్‌ స్కూటర్‌ బజ్‌ను ప్రకటించింది .త్వరలోనే డెలివరీ టూ వీలర్‌ మోడల్‌ను సైతం విడుదల చేయనుంది.

గ్రూప్‌ కంపెనీ జైద్కా కు రెండు తయారీ కేంద్రాలు హౌరా, హోసూరులలో ఉన్నాయి. వీటి ఉత్పత్తి సామర్ధ్యం సంవత్సరానికి 20వేల వాహనాలు. త్వరలోనే ఒక లక్ష యూనిట్లకు ఈ సామర్థ్యం విస్తరించనుంది. ఈ కంపెనీ 2024 నాటికి 100% స్ధానికీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...