బైక్ కొనాలి అనుకుంటున్నారా? ఫ్లిప్ కార్ట్ లో అదిరే ఆఫర్!

-

బడ్జెట్ ధరలో మంచి బైకు కొనాలనుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఫ్లిప్ కార్ట్. ఈ బంపర్ ఆఫర్ ద్వారా భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు తక్కువ ఈఎంఐ ఆప్షన్ లోనే బైక్ పొందొచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్ కార్ట్ లో బైక్స్ పై అదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో కంపెనీ బైక్స్ పై కూడా సూపర్ డీల్స్ ఉన్నాయి. హీరో కంపెనీ నుంచి వచ్చిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ మంచి ఆదరణ పొందింది. ఈ మోడల్ పై ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో సూపర్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.

- Advertisement -

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర ప్రస్తుతం రూ. 64,518గా (ఎక్స్ షోరూమ్) ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 58.917కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ బైక్ కొనుగోలుపై రూ. 5 వేల 600 వరకు తగ్గింపు వస్తోందని చెప్పుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా బైక్ కొంటే ఈ డీల్ లభిస్తోంది. ఈ బైక్ లో 97 సీసీ ఇంజిన్ ఉంది. డ్రమ్ బ్రేక్, అలాయ్ వీల్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ఈ బైక్ పై 5 ఏళ్ల వరకు వారంటీ సైతం అందిస్తోంది. కిక్ స్టార్ట్ మోడల్ కు ఈ డిస్కౌంట్ ఆఫర్లు వర్తిస్తాయి. అంతేకాకుండా ఈ బైక్ పై తక్కువ ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 3,100 నుంచి ప్రారంభం అవుతోంది. అంటే రోజుకు దాదాపు రూ.100 పొదుపు చేస్తే చాలు. 24 నెలల టెన్యూర్ ఎంచుకుంటే ప్రతీ నెల రూ. 3 వేల 129 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అదే 18 నెలల టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 4 వేలు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.

ఇంకా తక్కువ టెన్యూర్ పెట్టుకుంటే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ వర్తిస్తుంది. అంటే వడ్డీ లేకుండా మీరు సులభ ఈఎంఐలో ఈ బైకు కొనుగోలు చేయొచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులకు ఇది వర్తిస్తుంది. ఏడాది పాటు టెన్యూర్ అయితే నెలకు రూ.5,400 వరకు పడుతుంది. అదే 9 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ.7,200 కట్టాల్సి ఉంటుంది. ఇక 6 నెలల టెన్యూర్ ఉంటే నెలకు రూ. 10,700 చెల్లించాలి. 3 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 21,500 కట్టాలి. మీరు ఎంచుకునే టెన్యూర్ క్రెడిట్ కార్డు ఆధారంగా ఈఎంఐ కూడా మారుతుందని గుర్తుంచుకోవాలి. బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా కూడా ఈ బైక్ కొనొచ్చు. 9 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...