ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోత నడుస్తోంది. ఆర్థిక మాంద్యం పేరుతో దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఇండియాలో కూడా భవిష్యత్తులో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF Report) ఓ నివేదిక విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 22 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్ వంటి కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో కంపెనీలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయని తెలిపింది. 2027నాటికి 83 మిలియన్ ఉద్యోగాలు మాయమైపోనుండగా.. 69 మిలియన్ కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయంది. అందుకే భవిష్యత్తులో ఏ ఉద్యోగాలు ప్రపంచాన్ని శాసించబోతున్నాయో తెలుసుకుని వాటిపై ఇప్పటి నుంచే దృష్టిపెడితే ఆయా రంగాల్లో దూసుకుపోవచ్చని పేర్కొంది. WEF Report లో మొత్తం ఏడు రంగాలు ప్రపంచాన్ని ఏలబోతున్నట్లు వెల్లడించింది. అవి ఏంటంటే..
1. రోబోటిక్ ఇంజనీర్లు
2. ఎలక్ర్టిక్ వెహికల్స్(EV) నిపుణులు
3. ఏఐ(AI) ఎక్స్‌పర్ట్స్
4. ఫిన్‌టెక్ నిపుణులు
5. డేటా విశ్లేషకులు(DATA Analysts)
6. సుస్థిరత నిపుణులు(Sustainability experts)
7. పర్యావరణవేత్తలు (Environmentalist)
ప్రపంచాన్ని శాసించబోతున్న ఈ ఏడు రంగాలపై దృష్టిపెడితే మీ కెరీర్ భవిష్యత్ అద్భుతంగా మలుచుకోవచ్చు.
భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోయే ఉద్యోగాలు ఏంటంటే?
-