దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.? ఇలా చేయండి

Do this if you are suffering from cough

0
291

ఓ పక్క వర్షాలు కురుస్తున్నాయి .మరో పక్క కరోనా టెన్షన్ ఈ సమయంలో కాస్త జలుబు, దగ్గు వచ్చినా జనం కంగారు పడుతున్నారు. ఎందుకంటే సీజన్ మారిందంటే జబ్బులు కూడా మనల్ని వేధిస్తాయి. అందుకే రెయినీ సీజన్ లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి.

ఈ సమయంలో మనం మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఇమ్యునిటీ ఉండే ఫుడ్ తీసుకుంటే సమస్యలు ఉండవు. జలుబుతో పాటు దగ్గు చాలా మందిని వేధిస్తుంటుంది. దీనిని నివారించేందుకు పలు టాబ్లెట్స్ వాడినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మరి దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం

తెనె. యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను తెనె కలిగి ఉంటుంది. మీరు వేడి నీటిలో రెండు స్పూన్లు తెనె వేసి తీసుకోండి ఎంతో మంచిది.

ఇక వెల్లుల్లి- మనం నిత్యం కూరల్లో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి, దీని వల్ల ఎలాంటి జబ్బులు దరిచేరవు. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది.

చాలా మంది పైనాపిల్ తింటారు ఇది శరీరానికి మంచిది ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది దగ్గుకు చెక్ పెట్టే సరైన ఔషధం.

ఇక పసుపు కూడా మీరు ఆహరంలో తీసుకోండి.1/4 టీస్పూన్ పసుపును గ్లాసు పాలలో కలిపి తాగితే మీకు దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక రోజు కచ్చితంగా గోరు వెచ్చని నీరు తాగండి