కివి పండ్లను ఈ స‌మ‌స్య‌లు ఉంటే అస్స‌లు తీసుకోవ‌ద్దు

Do not take kiwi fruit at all if you have these problems

0
299

ఈ క‌రోనా స‌మ‌యంలో సిట్రిస్ పండ్లు ఎక్కువ మంది తీసుకునేవారు. ముఖ్యంగా నిమ్మ‌, దానిమ్మ‌, నారింజ కివి ఈ ప్రూట్ కి ఎంతో డిమాండ్ ఏర్ప‌డింది. ఇందులో ఉండే సి విటమిన్ మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే కివి పండ్ల‌ను అధికంగా తీసుకునేవారు. అయితే వైద్యులు కొన్ని విష‌యాలు చెబుతున్నారు.

కివి అందరికీ ఒకేవిధంగా మేలు చేయదు. కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న వారు కివీకి దూరంగా ఉండాలి. కిడ్ని స‌మ‌స్య‌లు ఉండి రోజూ మందులు వేసుకునే వారు ఉంటే క‌చ్చితంగా కివికి కొంచెం దూరంగా ఉండాలి. ఇందులో ఉండే పొటాషియం మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారిపై మరింత ఎఫెక్ట్ చూపుతుంది. అయితే ఏదో అప్పుడ‌ప్పుడూ అయితే ప‌ర్వాలేదు నిత్యం మాత్రం వ‌ద్ద‌నే చెబుతున్నారు.

అధికంగా తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఎవ‌రికి అయినా స్కిన్ ఎల‌ర్జీ స‌మ‌స్య ఉంటే మాత్రం ఈ కివి తీసుకోవ‌ద్దు. గర్భిణీ స్త్రీలు కూడా రోజుకి ఓ పండు మాత్ర‌మే తీసుకుంటే మంచిది. కొంద‌రికి అసిడిటి గొంతు నొప్పి స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఏది అతిగా తీసుకున్నా ప్ర‌మాద‌మే ఈ స‌మ‌స్య‌లు ఉంటే ఓసారి వైద్యులని అడిగి ఈ పండ్లు తీసుకోవ‌డం మంచిది.