కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఎవరు ఎంత కష్టం చేసినా చివరకు తినే తిండి కోసమే కదా. కాని కొంత మందికి ఆ అన్నం కూడా దొరక్క ఎన్నో అవస్దలు పడుతున్నారు.ఉపాధి లేకపోవడంతో పాటు ఆహార నిల్వలు లేకపోవడంతో కొన్ని దేశాల్లో ఒకపూట మాత్రమే తిండి తినే వారు ఉన్నారు. .
ఇలా రోజు ఆకలి వందలాది మందిని కబళిస్తోంది. పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారు. వినడానికే ఎంతో బాధగా ఉంది.. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే. ఆకలితో ఏకంగా 11 మంది మరణిస్తున్నారట.
ఈ నివేదక చూసిన వారు చాలా మంది షాక్ అవుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్దితి కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదికలో తెలిపారు. ఈ 18 నెలల కాలంలో ఆహర పదార్దాల ధరలు 40 శాతం పెరిగాయి.