ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 20,528 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యాక్టివ్ కేసుల విషయానికొస్తే 1,43,449 కు చేరింది. దేశంలో తాజాగా 56 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,25,709 కి చేరింది. దేశ వ్యా ప్తంగా రికవరీల సంఖ్య 4,30,81,441 కు చేరింది.
మొత్తం కేసులు: 4,37,50,599
మొత్తం మరణాలు: 5,25,709
యాక్టివ్ కేసులు: 1,43,449
కోలుకున్నవారి సంఖ్య: 4,30,81,441