తెలంగాణలో కొత్తగా 2707 కేసులు..ఆ జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు

2707 new cases in Telangana..the highest number of cases were registered in those districts

0
94
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ మొదలైందనే భయం కలుగుతుంది.

తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 84,280 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2707 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి ధాటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 4,049కి చేరుకుంది. కరోనా బారి నుంచి 582 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 20462 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య తెలిపింది. ఒక్క GHMC లోనే 1328కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత మేడ్చల్ లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.

ఆదిలాబాద్ 14
కొత్తగూడెం 40
జిహెచ్ఎంసి 1328
జగిత్యాల 19
జనగామ 17
జయశంకర్ భూపాలపల్లి 6
జోగులాంబ గద్వాల 7
కామారెడ్డి 14
కరీంనగర్ 38
ఖమ్మం 56
కొమరం భీం ఆసిఫాబాద్ 14
మహబూబ్ నగర్ 35
మహబూబాబాద్ 44
మంచిర్యాల 58
మెదక్ 24
మేడ్చల్ మల్కాజ్ గిరి 248
ములుగు 8
నాగర్ కర్నూల్ 22
నల్లగొండ 29
నారాయణపేట 14
నిర్మల్ 16
నిజామాబాద్ 60
పెద్లపల్లి 52
రాజన్న సిరిసిల్ల 13
రంగారెడ్డి 202
సంగారెడ్డి 78
సిద్దిపేట 36
సూర్యాపేట 38
వికారాబాద్ 36
వనపర్తి 15
వరంగల్ రూరల్ 17
వరంగల్ అర్బన్ 75
యాదాద్రి భువనగిరి 37