దేశంలో కొత్తగా 2828 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
106

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో నిన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు నేడు స్వల్పంగా పెరగడం ప్రజలు కాస్త ఆందోళనపడే విషయంగానే చెప్పుకోవచ్చు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2828  కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,31,53,043గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 17,087కు చేరింది. దేశంలో తాజాగా 14 మంది కరోనాతో మరణించడం జరిగింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,28,44,077 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 4,31,53,043

మొత్తం మరణాలు: 5,24,586

యాక్టివ్​ కేసులు: 17,087