ఊపిరితిత్తుల బలానికి ఈ మూలికలు దివ్య ఔషధాలే!

-

Lungs Health | మానవ శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాల్లో ఊపిరిత్తులు కూడా ఉంటాయి. మన నిద్రించే సమయంలో కూడా ఇవి మన రక్తం ద్వారా ప్రితి అవయవానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తూనే ఉంటాయి. మన పూర్తి ఆరోగ్యంతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం బయట ఉన్న కాలుష్యం, ఇన్ఫెక్షన్ల వల్ల ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు అధికం అవుతున్నాయి. కాగా కొన్ని మూలికలను వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులను పూర్తి ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. వాటిలో పిప్పలి, పొడి అల్లం, తులసి, అతిమధురం కీలకంగా ఉంటున్నాయి.

- Advertisement -

పిప్పలి: మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో పిప్పలి ఎంతో ఉపయోగపడతాయి. మన శ్వాసకోశ వ్యవస్థకు పిప్పలిని అమృతం లాంటిదని ఆయుర్వేదం చెప్తుంది. ప్రతి రోజూ తీసుకునే పిప్పలి పరిమాణాన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పాలతో 15 రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత మరో 15 రోజుల పాటు పిప్పలి పరిమాణాన్ని తగ్గించుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి అనేక శ్వాసకోస సమస్యలను దూరం చేస్తుంది.

పొడి అల్లం: ఎండు అల్లం కూడా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేత నిపుణులు చెప్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మంటను తగ్గించడంలో ఎండు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్‌ను కూడా తగ్గిస్తుంది. గొంతు సంబంధిత సమస్యలకు కూడా పొడి అల్లం బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్న మాట.

అతిమధురం(ములేతి): ఇందులో ఉండే తీపి, శీతలీకరణ లక్షణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. జలుబు, దగ్గు వంటి అనేక సమస్యలకు అతిమధురం అద్భతమైన ఔషధం. ఊపిరితిత్తులు, గొంతులో పేరుకుపోయిన మందపాటి శ్లేష్మాన్ని కరిగించి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుందని, గొంతు నొప్పిని కూడా అతిమధురం తగ్గిస్తుందని ఆయుర్వేదం చెప్తోంది.

తులసి: తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో కూడా తులసి అద్భుతంగా పనిచేస్తుంది. తులసి ఆకులలో ఉండే యూజినాల్.. జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా మూడు నుంచి ఐదు తులసి ఆకులను తినడం ద్వారా అనేక వ్యాధులు తగ్గుతాయని, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు.

తానికాయ(బిభితాకి): ఆయుర్వేదంలో తానికాయకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక రోగాలకు విరుగుడుగా చెప్పే త్రిఫలాలలో ఇది కూడా ఒకటి. ఈ పండు తినడం వల్ల జలువు, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గొంతు వాపు, పెరిగిన కఫాన్ని తొలగించడంలో కూడా తానికాయ గొప్పగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

వీటిలో ఏదైనా తీసుకోవడం ప్రారంభించిన వారం రోజుల్లోనే మార్పును చూడొచ్చని కూడా అంటున్నారు. వీటితో పాటుగా భ్రమరి, కపాలభాతి, అనులోమ్-విలోమ్ వంటి యోగా చేయడం ద్వారా కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వారు రోజూ ఆహారంలో పెరుగు తినడం మానుకోవాలని, చల్లటి ఆహారాలకు కూడా దూరం పాటించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. వీటితో పాటు పలు ఆయుర్వేదిక్ సిరప్‌లు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని(Lungs Health) పెంపొందిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

Read Also: సరిపడా నిద్ర పోవట్లేదా.. ఈ రోగాలు రావడం పక్కా..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...