చక్కని ఆరోగ్యానికి 5 సూత్రాలు..పాటిస్తే ఎంతో మేలు..

0
120

ప్రస్తుత జీవనవిధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. కనీసం తినడానికి కూడా టైం దొరకని పరిస్థితి వచ్చింది. పనిలో పడి కొంతమంది అసలు తినకపోగా మరికొందరు ఒక్కసారే మొత్తం లాగించేస్తారు. దీనితో కొవ్వు పెరిగి నానా తంటాలు పడుతారు. అయితే మన శరీరానికి కావలసిన ముఖ్యమైనవి ఏంటి? అవి ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1.ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి:

ఆకలి లేదనో, పని వొత్తిడి ఇలా ఇతరత్రా బీజీ పనుల వల్ల ఉదయం టిఫిన్ తీసుకోకుండా అంతే ఉండిపోవటం ఆరోగ్యానికి ఎంతో హానికరం. టిఫిన్ తినకుండా ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేయడం వలన ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల శరీరంలోకి చెడు కొవ్వు చేరుతుంది. కావున ఉదయం టిఫిన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో మంచి ఆహారం తీసుకోవటం మంచిది.

2.తగినంత నీరు :

రోజుకి 3 లీటర్లు నీళ్ళు తాగాలి. పొద్దున నిద్ర లేవగానే ఎక్కువ మోతాదులో నీరు త్రాగ్రడం చాలా మంచిది, ఇలా చేస్తే మీకు ముత్ర విసర్జన సాఫీగా సాగుతుంది. మనం ఏ ఆహారం తీసుకున్న ఎక్కువ నీరు తాగటం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అలాగే మన దేహం లో చెడు కొవ్వుని తగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

3.పండ్లు,కూరగాయలు తినటం

ప్రతిరోజు పండ్లు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పండ్లు, కురగాయాలలో ఎన్నో మంచి ప్రోటిన్స్, ప్రోటిన్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. పండ్లు తినడం ఇష్టం లేని వాళ్ళు పళ్ళ రసాలు తాగవచ్చు. రోజు పండ్లు, కురగాయాలు తినడం మన దేహం పైన ముడతలు తొలగిపోయి యవ్వనం కనపడతారు.

4.ఉప్పు, కారం, మసాలాలు తక్కువగా :

ఉప్పు, కారం మరియు మసాలాలు తినడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిదికాదు. మన జీర్ణ శక్తి ని దెబ్బతిస్తాయి. ఉప్పు, కారం మరియు మసాలాలు తినడం వలన బిపి, అల్సర్, ఉబకయం వంటి సమస్యలు వస్తాయి. ఉప్పు, కారం మరియు మసాలాలు అధిక పరిమాణంలో తీసుకోవద్దు. తక్కువ మోతాదులో ఉపయోగించుకొండి. ఏ ఆహారం అయిన అధిక మొత్తం లో తీసుకోవటం ఆరోగ్యానికి హానికరం.

5.మాంసాహరం తక్కువగా :

మంసహరాన్ని తినడానికి చాలా మంది ఇష్ట పడుతుంటారు. ఎక్కువ మాంసాహరాన్ని తినడం వలన అజీర్తి,ఊబకాయం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మాంసాహారం ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. మాంసాహారం అధిక మోతాదులో తీసుకోవటం వల్ల జీర్ణప్రక్రియ మందగిస్తుంది.