ఒమిక్రాన్ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. తాజాగా..బ్రిటన్ లో ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మరణించాడన్న వార్త కలకలం సృష్టించింది. అయితే అదే బ్రిటన్‌లో ఒక్క ఒమిక్రాన్‌తోనే 75 వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం అంచనా వేయడం అత్యంత ఆందోళనకర విషయం.
2021 జనవరితో పోల్చుకుంటే. ఒమిక్రాన్‌తో కరోనా కేసులు మరింత ఎక్కువగా బయటపడతాయని, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుందని హెచ్చరించింది.మరిన్ని చర్యలు తీసుకోకపోతే.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఒమిక్రాన్‌తో 25వేల నుంచి 75వేల మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ఓ మోడెలింగ్ అధ్యయనం పేర్కొంది.
ఒమిక్రాన్ ముప్పుపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని, ప్రపంచవ్యాప్తంగా మరింత డేటా తెలియాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. తమ అధ్యయనం.. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.