మంకీపాక్స్ కలకలం..ఈ జాగ్రత్తలు పాటిస్తే 99 శాతం సేఫ్!

0
110

భారత్ లో మంకీపాక్స్ కలవరపెడుతుంది. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించగా..అందులో 3 కేసులు కేరళలోనే కావడం గమనార్హం. దిల్లీలో ఓ కేసు బయటపడగా బాధితుడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలడం ఆందోళన కలిగించే అంశం. అతనికి మంకీపాక్స్ ఎలా సోకిందనేది ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తుంది. మరి ఈ మహమ్మారి బారిన పడకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తే 99 శాతం సేఫ్ గా ఉండవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ మంకీపాక్స్‌ ఇప్పటివరకు 75 దేశాలకు విస్తరించింది. 16వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌కు నిపుణుల కమిటీ సూచించిన నేపథ్యంలో శనివారం ఈ ప్రకటన వెలువడింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

మంకీపాక్స్‌ను అడ్డుకోవాలంటే కరోనా తరహాలోనే మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

విదేశీ ప్రయాణాలు చేసిన వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కవని, వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అన్ని జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

అన్ని జాగ్రత్తలు పాటిస్తే 99 శాతం ఈ వైరస్‌ను నివారించవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.