ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారి రూపాలు మార్చుకుంటూ ప్రజలను వణికిస్తోంది. ఉన్న వేరియంట్లు సరిపోవా అన్నట్లు తాజాగా ఇజ్రాయెల్ దేశంలో మరో కొత్త కరోనా వేరియంట్ గుర్తించారు. గర్భంతో ఉన్న ఒక మహిళలో కరోనా, ఇన్ఫ్లూయెంజా వైరస్ లతో కూడిన డబుల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
రెండు వైరస్ లు కలిసి ఎటాక్ చేస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఈ కొత్తరకం కరోనా వేరియంట్కి ‘ ఫ్లోరోనా ‘ అని పేరు పెట్టారు. ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ తో ప్రపంచ దేశాలు గజగజలాడుతుంటే.. మరో కొత్త కరోనా వేరియంట్ రావడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది.