ఈ ఆహారపదార్ధాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది ఇదే లిస్ట్

ఈ ఆహారపదార్ధాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది ఇదే లిస్ట్

0
138

మనం తినే ఆహారాల్లో కొన్ని ఈజీగా జీర్ణం అయితే మరికొన్ని కాస్త సమయం తీసుకుంటాయి, ఉదాహరణకు ఆకుపచ్చని కూరలు, అలాగే ఆకుకూరలు ఈజీగా జీర్ణం అవుతాయి మరికొన్ని మాత్రం కాస్త సమయం తీసుకుంటాయి, కూరగాయల్లో కూడా కొన్ని తింటే అవి అరుగుదలకు కాస్త టైం తీసుకుంటాయి, మరి ప్రయాణాలు చేసిన సమయంలో వీటి వలన మలబద్దకం ఏర్పడుతుంది.

అందుకే తినే ఫుడ్ ఏది బెటర్, అలాగే ఏది త్వరగా జీర్ణం అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి అంటున్నారు వైద్యులు..పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడి ఇది చాలా డేంజర్ ఎందుకు అంటే ఇది అరగడానికి చాలా సమయం తీసుకుంటుంది, కాని శరీరానికి చాలా మంచిది అందుకే ఓ స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు.

ఏది అయినా డీప్ ఫ్రై చేస్తే అది డేంజర్ ఫుడ్.. అది కూడా కాస్త అరుగుదలకు సమయం తీసుకుంటుంది, ముఖ్యంగా బంగాళాదుంప, బజ్జీలు,కేబేజి, బ్రక్కోలి, ముల్లంగి వంటివి బరువైన ఆహారాలు. ఇవి జీర్ణం కావడానికి కాస్త సమయం తీసుకుంటాయి.