ప్రతీ ఒక్కరు ఇంటిలో మొక్కలు పెంచుకుంటారు. బాగా పెరటి ఉంది అంటే మొక్కలు చెట్లు కూడా నాటి ఏపుగా పెంచుతారు. ఆక్సిజన్ కూడా ఎక్కువగా వస్తుంది ఆ పరిసరాల్లో. అయితే పూలు పండ్లతో చక్కని పచ్చని పందిరిలా కనిపిస్తుంది చెట్లు మొక్కలు ఉంటే. వాస్తుని కొందరు బాగా నమ్ముతారు వాస్తు ప్రకారం చాలా మంది ఇళ్లు కట్టుకుంటారు అలాంటి వారు గార్డెన్ కోసం కొంత ప్లేస్ ఉంచుతారు.
ఇంటి ప్రహరీ దగ్గర ? ఇంటి ముందు లేదా గార్డెన్ లో ఈ మొక్కలు ఎక్కడ నాటి పెంచుకుంటే మంచిది అనేది చూద్దాం. ఇంటిలో చెట్లు ఉంటే చాలా మంచి ఐశ్వర్యం కలుగుతుంది.
నేరేడు చెట్లుని ఇంటికి దక్షిణ దిశలో లేదా నైరుతి వైపు నాటాలి
మామిడి ఇంటి నుంచి తూర్పు లేదా ఉత్తరం మధ్యలో పెంచితే మంచిది
ఆగ్నేయ దిశలో చింతచెట్లు మంచిది
బేల్ చెట్టును పశ్చిమ దిశలో పెంచాలి
దానిమ్మ ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచితే మంచిది
ఉసిరి చెట్టును ఈశాన్య మూలలో నాటితే మంచిది
మర్రి ఇంటికి తూర్పు దిశలో ఉండటం మంచిది
పూల మొక్కలు ఏమైనా దక్షిణ తూర్పు దిశలో నాటితే మంచిది