ఏసీలు వాడుతున్నారా క‌చ్చితంగా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి

ఏసీలు వాడుతున్నారా క‌చ్చితంగా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి

0
109

ఇప్పుడు వేస‌వికాలం కావ‌డంతో చాలా వ‌ర‌కూ అంద‌రూ ఏసీలు కూల‌ర్లు బాగా వాడుతూ ఉంటారు, ఇక వినియోగం కూడా బాగా పెరిగింది.. ఈ స‌మయంలో వైర‌స్ వ్యాప్తి పెరుగుతుంది అని ప్ర‌చారం జ‌రుగుతోంది, దీంతో కేంద్రం దీనిపై ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది..

మీ ఇళ్లలో ఏసీల వాడకంలో గది ఉష్ణోగ్రతను 24 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలని, సంబంధిత తేమ శాతం 40 నుంచి 70 మధ్య ఉంటే మేలని సూచించింది. వ్యాధికారక క్రిముల వ్యాప్తి నివారణకు ఇవి సరైన ఉష్ణోగ్రతలని వివరించింది. ఫ్యాన్లు వాడ‌ట‌మే దీనికి మేలు అని తెలిపింది.

నాలుగు వైపులా గాలి వెళ్లేలా ఉండాలి అని తెలిపారు. కిటికీలు కూడా పాక్షికంగా తెరిచి ఉంచాలి అని తెలిపారు…కిచెన్, టాయిలెట్లలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. తద్వారా బయటి నుంచి దుమ్ము, ధూళితో కూడిన గాలిని నిరోధించవచ్చు. నీటి ట్యాంకులు శుభ్ర‌ప‌ర‌చుకోవాలి, ఏసీల‌లో డ‌స్ట్ లేకుండా చూసుకోవాలి, ఆ ఫిల్ట‌ర్లు డ‌స్ట్ తో లేకుండా క్లీన్ చేయాలి.