ప్రజలకు అలర్ట్..రానున్న 4 రోజులు భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

0
103

భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత మరింత పెరగడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఎండల తీవ్రత వల్ల చాలామంది అలసటకు గురవుతున్నారు. మార్చి లోనే ఇలా ఉంటే..ఎప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు జంకుతున్నారు. ఇప్పుడే వచ్చే 4 రోజులు అప్రమత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొమురం భీం జిల్లా  43.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా  43.8 డిగ్రీలు,  ఆదిలాబాద్ 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరోవైపు రానున్న 4 రోజుల్లో మరింతగా ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల సాధారణం కన్నా 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎప్రిల్ 1,2 తేదీల్లో ఉత్తర వాయువ్యం నుంచి వడగాలులు వీస్తాయని..మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.