సాధారణంగా అందరు మూడుపూటలా అన్నం తింటూ ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకుంటారు. కానీ కేవలం అన్నమే తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందకా వివిధ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే మనరోజువారి ఆహారంలో రకరకాల పండ్లను, కూరగాయలు ఉండేలా చూసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కేవలం అన్నమే తినడం వల్ల కలిగే నష్టాలూ మీరు కూడా ఓ లుక్కేయండి..
వైట్ రైస్ ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటుగా ప్రమాదకరమైన గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మధుమేహులు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మధుమేహ వ్యాధిగ్రస్థులు వైట్ రైస్ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి సమస్య అధికం అవుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు కూడా వైట్ రైస్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇది బరువును మరింత పెంచేందుకు తోడ్పడడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే వైట్ రైస్ ను నెలకు ఒకసారి మాత్రమే తింటూ..దీనికి బదులుగా మార్కెట్ లో దొరికే బ్రైన్ రైస్, బ్లాక్ రైస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.