డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని అందరికి తెలుసు. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభించడంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా వెంటనే చెక్ పెడతాయి. కానీ డ్రై ఫ్రూప్ట్స్ లో చాలామంది ఇష్టపడని పదార్థం ఏదైనా ఉంది అంటే అంజీర్ పండ్లు మాత్రమే. ఇవి కేవలం డ్రై ఫ్రూట్స్ రూపంలోనే కాకుండా పండ్ల రూపంలోనూ లభిస్తూ ఉంటాయి.
మనం వీటిని ఎలా తీసుకున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అంజీరా పండ్లు మన శరీరానికి ఎంతో మేలు చేయడంతో పాటు..రక్త హీనతను తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. పిల్లల నుండి వృద్దుల వరకు ఎవరైనా ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్యసమస్యలనైనా మన దరికి చేరకుండా కాపాడుతుంది.
పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, ఫైబర్, కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా లభించే అంజీరాలను రోజుకు రెండు లేదా మూడు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు భోజనానికి రెండు గంటల ముందు ఈ పండ్లను తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన అన్నం తినాలనిపించదు. దాని కారణంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా వేసవిలో ఎలాంటి సమస్యలకైనా చెక్ పెట్టటడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.