నల్ల మిరియాలతో ఈ సమస్యలన్ని మటుమాయం అవ్వడం ఖాయం!

0
94

నల్ల మిరియాల్లో అనేక ఔషధ గుణాలు ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను వంట ఇంటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు. వీటితో వంటలకు చక్కని రుచి వస్తుంది. ఇంకా వీటి వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం..

మిరియాలలో సోడియం, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటితో వంటలకు చక్కని రుచి రావడంతో పాటు..ఎన్నో రోగాలను నయం చేయడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడువారికి మిరియాలు అద్భుతంగా ఉపయోగపడతాయి.

నల్ల మిరియాల టీ తాగితే చక్కటి ఫలితం లభిస్తుంది. ఇవి కేలరీలను కరిగిస్తాయి. అంతేకాకుండా  దీనిలో ఉండే ఫైబర్ వల్ల ఆకలి తొందరగా కాదు. ఫలితంగా శరీరం బరువు పెరుగకుండా చూసుకోవచ్చు. ఇంకా కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా నల్ల మిరియాలు ఉపయోగపడతాయి. వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ల నుంచి బయటపడేయడానికి నల్ల మిరియాలు సహాయపడతాయి.