దాల్చిన చెక్కతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

0
102

ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. వంట‌కాల్లో దాల్చిన చెక్క‌ను వాడ‌డం వ‌ల్ల వంటల‌ రుచి, వాస‌న పెరుగుతుంది. అంతేకాకుండా దీనిలో ఉండే ఔష‌ధ గుణాల కార‌ణంగా ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. ఇంకా దీనివల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

త‌ల‌నొప్పితో బాధపడేవారికి దాల్చిన చెక్క‌ అద్భుతంగా ఉపయోగపడుతుంది. త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు దాల్చిన చెక్క‌ను నీటితో అర‌గ‌దీసి ఆ మిశ్ర‌మాన్ని నుదుటి పై రాసి 5 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి నుండి ఉప‌శ‌మ‌నం కలిగి మంచి ఫలితాలు లభిస్తాయి. గొంతు బొంగురు పోయిన‌ప్పుడు దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ రసాన్ని మింగ‌డం వ‌ల్ల గొంతు బొంగురు తగ్గిపోతుంది.

అంతేకాకుండా ద‌గ్గు కూడా తగ్గుతుంది. క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు దాల్చిన చెక్క‌ను నేరుగా తిన్నా లేదా దాల్చిన చెక్క పొడిని నీటిలో క‌లుపుకుని తాగినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా దాల్చిన చెక్కను త‌ప్ప‌కుండా ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.