బాగానే కనిపించిన కొంత మందికి కొన్ని అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి, కొన్ని చర్మ వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, తాజాగా ఓ సమస్య ఇలాంటిదే బయటకు తెలిసింది.
అమెరికాకు చెందిన మోనికా అనే మహిళకు ఓ విచిత్రమైన సమస్య ఉంది. ఆమె చేతి వేళ్లు రంగులు మారిపోతుంటాయి.
అయితే వాతావరణంలో కాస్త చలి కాస్త రెయిన్ లేదా ఎండ ఉంటే ఇలా మూడు కాలాల బట్టీ ఆమె చేతి వేళ్లు రంగు మారుతున్నాయి, అయితే కేవలం రెండు వేళ్లు మాత్రమే ఇలా మార్పులకి లోను అవుతున్నాయి.
చల్లటి వాతావరణంలో ఎక్కువ సేపు ఉంటే ఆమె చేతి మధ్య, ఉంగరం వేళ్లు తెల్లగా మారిపోతాయి.
అరుదైన వ్యాధి వల్లే ఇలా ఆమె వేళ్లు రంగులు మారతున్నాయని అక్కడ వైద్యులు గుర్తించారు, దీని పేరు పేరరెయినాడ్స్ సిండ్రోమ్, ఈ సమస్య వస్తే చర్మంపాలిపోయినట్లు మారుతుంది.
అయితే దీని వల్ల ప్రాణాపాయ సమస్యలు ఉండవు అని తెలిపారు.