నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు, ఆనందయ్య పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా ఆనందయ్య మందు ఎప్పుడు వస్తుందా ? ఎప్పుడు వేసుకుందామా అని చూస్తున్నారు. ఇక ఆనందయ్య మందు సోమవారం వస్తుందని కొందరు, రాదని కొందరు మాట్లాడుకున్నారు. అయితే రేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రంలో అందరికి పంపిస్తారా? అన్ని జిల్లాలకు రేపటి నుంచి వస్తుందా అంటే దీనిపై క్లారిటీ వచ్చింది. ముందు ఈ మందు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల వారికి పంపిస్తామన్నారు. ఇక బయట జరుగుతున్న వెబ్ సైట్ ప్రచారం పై కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ వెబ్ సైట్ కి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఈ విషయంపై రాజకీయాలు చేయద్దని ఆనందయ్య కోరారు.
ఆనందయ్య మందుకి ఏం పేరు పెడతారు అని వారం రోజులుగా ఒకటే చర్చ. మొత్తానికి ఈ ఔషధానికి ఔషధచక్ర అని పేరు పెట్టారు. కృష్ణపట్నం పోర్టు దగ్గర దీన్ని తయారు చేస్తున్నారు. ఫస్ట్ లక్ష మందికి మందు తయారు చేస్తున్నారట.