అనాసపండు తింటున్నారా దాని వల్ల కలిగే పది లాభాలు ఇవే

అనాసపండు తింటున్నారా దాని వల్ల కలిగే పది లాభాలు ఇవే

0
102

ఈ ప్రకృతిలో అనేక రకాల పండ్లు కూరగాయలు మనకు దొరుకుతాయి.. అవే మనకు అన్నీ రకలా మెడిసన్ అని చెప్పాలి, సరిగ్గా అన్ని రకాల పండ్లు తింటే ఎలాంటి సమస్యలు రావు, అయితే మనం అనాస పండుని చాలా ఇష్టపడతాం.. పైన అంతా ముళ్ల మచ్చల్లా ఉన్నా లోపల అమోఘమైన టేస్ట్ ఉంటుంది.

అనాస ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుస్తుంది..దీని నుండి తీసిన రసం పానీయంగా తాగుతారు. ఇలా తాగితే గొంతులో కపం పోతుంది..అలాగే ఈ పండు తీసుకుంటే జీర్ణశక్తి మెరుగు అవుతుంది, శరీరంలో దెబ్బలు తగిలినా రక్తం గడ్డకట్టినా అవి కరిగిపోతాయి..ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.

ఇక అనాస పండు రసం పంచదార ఐస్ లేకుండా తాగితే చాలా మంచిది, దీని వల్ల కడుపులో ఉండే పురుగులు పోతాయి, శరీరంపై ఉండే మచ్చలు తగ్గుతాయి, చర్మం కాంతి వంతంగా మారుతుంది. జ్వరంతో బాధపడేవారు కూడా డాక్టర్ సలహ మేరకు అనాస జ్యూస్ తాగుతారు. ఇక ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరం వాపులు సమస్యలు ఉంటే తగ్గుతాయి, ఇందులో పీచు పదార్ధం కాబట్టీ జీర్ణవ్యవస్ధ బాగుంటుంది, అయితే పండని అనాస మాత్రం తినవద్దు కడుపు నొప్ప వస్తుంది.