ఆంధ్రప్రదేశ్ లో బుధవారం నాటి కోవిడ్ కేసుల బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ నమూనా పరీక్షలు 1,01,544 చేయగా కోవిడ్ పాజిటివ్ కేసులు 6,617 నమోదయ్యాయి. పాజిటివ్ రేట్ : 6.5% గా ఉంది. మరణాల సంఖ్య 57 గా ఉంది. చిత్తూరు జిల్లాలో 9 మరణాలు, గుంటూరులో 9 మరణాలు నమోదు అయ్యాయి.
అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు చూస్తే… తూర్పుగోదావరి 1397 వచ్చాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 71466 ఉన్నాయి.
గత 24 గంటల్లో రికవరీ అయిన వారు 10228 మంది ఉన్నారు.
ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 12,109 (0.66%) గా నమోదైంది. .
రికవరీ . 18..26 లక్షల లో 17.43 లక్షల మంది రికవర్ అయ్యారు (95.5%).
‘‘అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లిన తప్పక మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి.. జాగ్రత్త గా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలి. లేదంటే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలవుతుంది. మనందరి జాగ్రత్త వలన ఇప్పుడిప్పుడే Covid తగ్గుముఖం పడుతోంది. కొంత కాలం ఇలాగే జాగ్రత్తగా ఉంటే కరోనా పైన విజయం మనదే అవుతుంది’’ అని ఎపి స్టేట్ కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.