ఎపిలో అనూహ్యంగా తగ్గిన కోవిడ్ కేసులు : జిల్లాల బులిటెన్ ఇదే

Andhra Pradesh Covid Cases Bulletin Released

0
102

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేసులతో పోలిస్తే మరణాల సంఖ్య మరింతగా తగ్గింది. బుధవారం నాటి బులిటెన్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. రాష్ట్రంలో ఇవాల నమోదైన కేసుల సంఖ్య 2591. బుధవారం నమోదైన మరణాల సంఖ్య 15. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బుధవారం పరీక్షించిన నమూనాలు : 90204
పాజిటివ్ రేట్ : 2.8%
చిత్తూరు జిల్లాలో ఇవాళ అత్యధికంగా నలుగురు మరణించారు.
ఇవాళ అత్యధిక కేసులు తూర్పుగోదావరి జిల్లాలో 511 నమోదయ్యాయి.
రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య : 25957
గత 24 గంటల్లో రికవరీ అయిన వారు 3329 మంది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోన మృతులు 13057 (0.68%)
రికవరీ 19.29 లక్షల్లో 18.90 లక్షల మంది రికవరీ అయ్యారు (98.%)

కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ వేళలో సడలింపులు మరింతగా ఇవ్వడం జరిగింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు :
అనంతపురం 69
చిత్తూరు 349
తూర్పు గోదావరి 511
గుంటూరు 219
వైఎస్సార్ కడప 217
కృష్ణా 190
కర్నూలు 29
నెల్లూరు 162
ప్రకాశం 251
శ్రీకాకుళం 62
విశాఖపట్నం 220
విజయనగరం 46
పశ్చిమగోదావరి 266