ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్ రిలీజ్ : కేసుల తగ్గుముఖం, ఇవాళ కేసులు ఇవే

0
111

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25% నుండి 5.2.% కు తగ్గింది. కరోనా కంట్రోల్ లోనికి వస్తున్నట్లు అనిపిస్తోంది అని వైద్యశాఖ వర్గాలు అంటున్నాయి. సోమవారం నాడు జారీ చేసిన కరోనా బులిటెన్ ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. బులిటెన్ వివరాలు…

సోమవారం నాడు నమూనా పరీక్షలు:87,756 జరిగాయి.

కోవిడ్ పాజిటివ్ కేసులు : 4549 నమోదయ్యాయి.

పాజిటివ్ రేట్ : 5.2 % ఉంది.

మరణాలు : 59
మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి

అధిక మరణాలు
చిత్తూరు 12

అత్యధిక కేసులు: చిత్తూరు 860
తూర్పుగోదావరి లో కాస్త తగ్గుముఖం పట్టాయి

మిగిలిన జిల్లాలలో కూడా కాస్త అదుపులోకి వచ్చాయి.

రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 80013

చాలా కాలం తర్వాత యాక్టివ్ కేసులు తగ్గుతూ రావడం జరిగింది

గత 24 గంటల్లో రికవరీ అయిన వారు 10114

కరోన మృతులు ఇప్పటివరకు: 11999(0.65%).
12000 కి దగ్గరగా వచ్చాము

రికవరీ . 18.14లక్షల లో 17.22లక్షల మంది రికవర్ అయ్యారు. (95.0%)

రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది

సుమారు 80000 పాజిటివ్ కేసులు, ఇంకా పరిక్షించాల్సిన వారు మన చుట్టూ ఉన్నారు.

అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లిన తప్పక మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి..

జాగ్రత్త గా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలి.

లేదంటే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలవుతుంది.

కొవిడ్ తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అదనపు ఎక్స్ గ్రేషియా ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

డాక్టర్ కు రూ.25 లక్షలు,

స్టాఫ్ నర్సుకు రూ.20 లక్షలు,

ఎఫ్‌ఎస్‌ఓ/ ఎమ్‌ఎస్‌ఓలకు రూ.15 లక్షలు,

ఇతర వైద్య సిబ్బందికి రూ.10 లక్షలు

కొవిడ్ తో మరణించిన వైద్యులు, సిబ్బంది కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను ప్రకటించడం ద్వారా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది.కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ (పిఎంజికె) పథకానికి అదనంగా ఈ ఎక్స్‌గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.

మనందరి జాగ్రత్త వలన ఇప్పుడిప్పుడే Covid తగ్గుముఖం పడుతోంది. ఇంకొంత
కాలం ఇలాగే జాగ్రత్తగా ఉంటే కరోనా పైన విజయం మనదే అవుతుంది.

మనల్ని మనం కాపాడుకోవడం కుటుంబ బాధ్యత మరియు సామాజిక బాధ్యతగా గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎపి స్టేట్ కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఒక ప్రటకనలో తెలిపారు.