ఎపిలో పెరిగిన కరోనా కేసులు : ఆ జిల్లాలో జీరో డెత్స్, బులిటెన్ రిలీజ్

Andhrapradesh Corona Cases Bulletin Released

0
104

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి గురువారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 3841. నిన్న బుధవారం 3797 కేసులు నమోదు కాగా ఇవాళ స్వల్పంగా పెరుగల కనబడింది. ఇవాళ 38 మంది మరణించారు. నిన్న 35 మంది మరణించగా ఇవాళ ముగ్గురు పెరిగారు.
ఇవాళ మొత్తం 90574 నమూనాలు పరీక్షించారు. కృష్ణా జిల్లాలో ఇవాళ అత్యధిక మరణాలు చోటు చేసుకోగా కేసుల సంఖ్య మాత్రం తూర్పుగోదావరిలో అధికంగా నమోదయ్యాయి.
మరణాల జాబితా కృష్ణా లో 8 మంది, చిత్తూరులో 5, తూర్పు గోదావరిలో 5, గుంటూరు 5, శ్రీకాకుళంలో 3, పశ్చిమ గోదావరిలో 3, అనంతపురం 2, కడప 2, విజయనగరం 2, కర్నూలు 1, నెల్లూరులో 1, విశాఖపట్నంలో 1 చొప్పున మరణించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 38178 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 3963 మంది ఉన్నారు. కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 12744 గా నమోదైంది. మొత్తం 18.93 లక్షల్లో 18.42 లక్షల మంది (97శాతం) మంది రికవరీ అయ్యారు.
జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…
అనంతపూర్ 141
చిత్తూరు 616
తూర్పుగోదావరి 760
గుంటూరు 313
వైఎస్సార్ కడప 171
కృష్ణా 350
కర్నూలు 45
నెల్లూరు 261
ప్రకాశం 296
శ్రీకాకుళం 113
విశాఖపట్నం 163
విజయనగరం 108
పశ్చిమ గోదావరి 504
అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.