ఏపిలో పెరిగిన కరోనా కేసులు : కోవిడ్ బులిటెన్ రిలీజ్, రెండు జిల్లాల్లో డబుల్ డిజిట్

Andhrapradesh corona cases bulletin released

0
91

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల తీవ్రత కంటిన్యూ అవుతున్నది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నాడు రిలీజైన బులిటెన్ లో వివరాలు చూస్తే… నమోదైన కేసుల సంఖ్య 3166. నిన్న మంగళవారం నమోదైన కేసులు 3042. అంటే ఇవాళ స్వల్ప పెరుగుదల కనిపించింది. విజయ నగరం, కర్నూలు జిల్లాల్లో మాత్రం కేసుల సంఖ్య డబుల్ డిజిట్ కే పరిమితమైంది. మిగతా 11 జిల్లాల్లో మాత్రం త్రిబుల్ డిజిట్ లో కేసులు కొనసాగుతున్నాయి.
ఇవాళ కోవిడ్ మరణాల సంఖ్య 21గా నమోదైంది.

ఇవాళ మొత్తం 83885 నమూనాలు పరీక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పటిలాగే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 664 కేసులు ఇక్కడ నమోదు అయ్యాయి. ఇక మరణాల సంఖ్య ఎప్పటిలాగే చిత్తూరులో అధికంగా నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో మరణాల సంఖ్య 4.
మిగతా జిల్లాల్లో మరణాలు చూస్తే.. తూర్పుగోదావరి 4, కృష్ణా లో3, అనంతపురంలో 2, గుంటూరులో 2, కర్నూలులో 2, పశ్చిమ గోదావరిలో 2, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 1 చొప్పున మరణించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 32356 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 4018 మంది ఉన్నారు. కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 12919 గా నమోదైంది.
జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…
అనంతపూర్ 102
చిత్తూరు 337
తూర్పుగోదావరి 664
గుంటూరు 239
వైఎస్సార్ కడప 221
కృష్ణా 191
కర్నూలు 45
నెల్లూరు 259
ప్రకాశం 375
శ్రీకాకుళం 103
విశాఖపట్నం 144
విజయనగరం 55
పశ్చిమ గోదావరి 431