ఎపి కోవిడ్ బులిటెన్ రిలీజ్ : తగ్గిన కేసులు, మరణాలు, జిల్లాల వారీ లిస్ట్ ఇదే

Andhrapradesh Corona Cases Bulletin Released

0
41

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి శుక్రవారం బులిటెన్ రిలీజ్ అయింది. నిన్నమొన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గిపోయింది. మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఇవాళ పాజిటీవ్ కేసులు 4458 నమోదయ్యాయి. మొత్తం 91,849 నమూనాలు పరీక్షించారు. పాజిటీవ్ రేట్ 4.8శాతంగా ఉంది. 38 మంది ఇవాళ మరణించారు. చిత్తూరులో ఇవాళ కూడా అత్యధిక మరణాల సంఖ్య చోటు చేసుకుంది. ఆ జిల్లాలో 9 మంది మృత్యువాతపడ్డారు. ఎప్పటిలాగే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 909 కేసులతో తూర్పుగోదావరి మొదటి స్థానంలో ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 47790 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 6313 మంది ఉన్నారు. కరోనా మృతులు 12528 గా నమోదైంది. మొత్తం 18.71 లక్షల్లో 18.11 లక్షల మంది రికవరీ అయ్యారు (96.8%తో).
నిన్న అంటే గురువారం నాడు ప్రభుత్వం వెలువరించిన కోవిడ్ బులిటెన్ లో నమోదైన కేసులు 4981. బుధవారం నమోదైన కేసులు 4684 లో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనబడింది. కానీ ఇవాళ మళ్లీ బుధవారం కంటే తక్కువకు కేసులు తగ్గిపోయాయి.

మరణాలు చూస్తే… చిత్తూరులో 9, కృష్ణా జిల్లాలో 8, గుంటూరు 5, తూర్పు గోదావరిలో 4, కర్నూలు 2, శ్రీకాకుళం2, విశాఖపట్నం 2, విజయనగరం 2, అనంతపురం 1, కడప 1, నెల్లూరు 1, పశ్చిమగోదావరి 1 చొప్పున మరణాల సంఖ్య నమోదైంది. ప్రకాశం జిల్లాలో మరణాల సంఖ్య సున్నా.
అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…
అనంతపూర్ 224
చిత్తూరు 708
తూర్పుగోదావరి 909
గుంటూరు 239
వైఎస్సార్ కడప 370
కృష్ణా 331
కర్నూలు 126
నెల్లూరు 212
ప్రకాశం 335
శ్రీకాకుళం 151
విశాఖపట్నం 198
విజయనగరం 64
పశ్చిమ గోదావరి 591
కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ఇవాళ సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష జరిపారు.