ఎపిలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు : బులిటెన్ రిలీజ్, జిల్లాల వారీ లిస్ట్ ఇదే

Andhraprasdesh Covid Cases bulletin released

0
105

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే మోస్తారుగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటికంటే సుమారు 500 కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. బుధవారం నాడు ప్రభుత్వం వెలువరించిన కోవిడ్ బులిటెన్ లో నమోదైన కేసులు 4684. అయితే మంగళవారం నాడు 4169 నమోదైన కేసుల కంటే ఎక్కువగా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న 53 మంది మరణించగా నేడు కేవలం 36 మంది మాత్రమే మరణించారు. కర్నూలు జిల్లా 73 కేసులతో డబుల్ డిజిట్ కేసులు నమోదైన జిల్లాగా నిలిచింది. మిగిలిన అన్ని జిల్లాలు త్రిబుల్ డిజిట్ కేసులతో నలిచాయి.
బుధవారం మొత్తం 80712 నమూనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1171 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 51204 ఉన్నాయి. గడిచిన 24 గంటలలో రికవరీ అయిన వారి సంఖ్య 7324. ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 12452 గా నమైంది. 1862036 కేసులు నమోదు కాగా… 1798380 మంది రికవరీ అయ్యారు.
మరణాలు చూస్తే… చిత్తూరులో 8, తూర్పు గోదావరిలో 5, కృష్ణా జిల్లాలో 5, అనంతపురంలో 3, నెల్లూరు 3, శ్రీకాకుళం 3, కర్నూలు 2, ప్రకాశం 2, విశాఖపట్నం 2, గుంటూరు లో 1, కడప 1, పశ్చిమగోదావరి 1 చొప్పున మరణాల సంఖ్య నమోదైంది.
అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…
అనంతపూర్ 236
చిత్తూరు 493
తూర్పుగోదావరి 1171
గుంటూరు 289
వైఎస్సార్ కడప 296
కృష్ణా 355
కర్నూలు 73
నెల్లూరు 306
ప్రకాశం 307
శ్రీకాకుళం 174
విశాఖపట్నం 173
విజయనగరం 151
పశ్చిమ గోదావరి 660