108 కేజీల కారం నీటితో పూజారికి అభిషేకం ఇలా ఎందుకు చేస్తారంటే

గ్రామ దైవం పెరియ కరుప్పసామికి పాలు, కారంపొడితో అభిషేకం

0
112

సినిమా హీరోలకు అలాగే రాజకీయ నేతలకు పాలాభిషేకం చేయడం మనం చాలా చోట్ల చూశాం. తమ అభిమాన నాయకుడు హీరోపై అభిమానంతో ఇలా చాలా మంది పాలాభిషేకం చేస్తారు. అయితే ఓ పూజారి ఆచారం కోసం ఏం చేశారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్రాంతంలో ఆచారం పేరుతో ఊరికి మంచి జరుగుతుందంటూ పూజారికి కారం స్నానం చేయించారు.

కొంచెం కారం కూరల్లో ఎక్కువ అయితే ఎంతో ఘాటు ఉంటుంది. ఇక అది చేతికి తగిలినా మంట వస్తుంది. అలాంటిది ఏకంగా 108 కేజీల కారంతో పూజారికి స్నానం చేయించారు భక్తులు. అమావాస్య రోజున తమిళనాడులో జరిగిన వినూత్న పూజా కార్యక్రమం ఇది. ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లి గ్రామంలో ప్రతి ఏటా ఆది అమావాస్య రోజున గ్రామస్థులు సామూహికంగా వేడుకలను నిర్వహిస్తారు.

ఆ గ్రామ దైవం పెరియ కరుప్పసామికి పాలు, కారంపొడితో అభిషేకం చేస్తారు. అంతేకాదు ఇక్కడ ఏనాటి నుంచో వస్తున్న సంప్రదాయం మద్యం సిగరెట్లు సమర్పిస్తారు. పూజారి పై భక్తులు 108 కేజీల కారం కలిపిన నీళ్లను తలపై నుంచి పోసి అభిషేకం చేస్తారు. ఇలా కారంతో పూజారికి అభిషేకం చేస్తే తమలో దుష్టశక్తులు, దురదృష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇలా అభిషేకం చేశాక కారం మరకలు పోయే వరకూ మళ్లీ మాములు నీటితో అభిషేకం చేస్తారు.