వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల కరోనా మరణాలు సంభవిస్తాయని ఐరోపా పరిధిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం హెచ్చరించింది. మొత్తంగా తమ కార్యాలయ పరిధిలోని 53 దేశాల్లో మరణాల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ల ద్వారా వైరస్ నుంచి రక్షణ క్షీణించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి క్రమంగా బూస్టర్ డోసు ఇవ్వాలని స్పష్టం చేసింది.
మరో 7 లక్షల మరణాలు..డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
Another 7 lakh deaths..WHO warning