వైద్య రంగంలో మరో అద్భుతం..మనిషికి పంది కిడ్నీ!

Another miracle in the medical field..pig kidney for man

0
66

వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి తాత్కాలికంగా అమర్చారు. ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని, మనిషి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగానే పని చేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మానవుల్లో అవయవ మార్పిడి సర్వ సాధారణమే అయినప్పటికీ అవయవాల కొరత వేధిస్తోంది. ఇందుకు పరిష్కారం కనుగొనే దిశగా శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనషులకు అమర్చే అంశంపై పరిశోధనలు సాగిస్తున్నారు.

ఇందులో భాగంగానే న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్‌ హెల్త్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన రోగికి పంది కిడ్నీ అమర్చాలని నిర్ణయించారు. ఇందుకు ఆ రోగి బంధువులు కూడా అంగీకరించగా..గత నెల ఆపరేషన్‌ నిర్వహించారు.

పంది కిడ్నీని రోగి శరీరానికి అమర్చి మూడు రోజల పాటు పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే పని చేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని సర్జన్‌ డా. రాబర్డ్‌ మోంట్గోమెరి తెలిపారు.