అసలే ప్రపంచం కరోనాతో అల్లాడిపోతోంది. ఇలాంటి వేళ మరికొన్ని కొత్త వైరస్ లు బెంబెలెత్తిస్తున్నాయి. ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. ఆఫ్రికాలోని గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ కేసును గుర్తించారు. ఎబోలా జాతికి చెందిన ఈ వైరస్ కరోనా తరహాలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తుందని ( డబ్ల్యూ హెచ్ ఓ) తెలిపింది. దీంతో నిపుణులు అనేక పరిశోధనలు చేస్తున్నారు.
ఈ వైరస్ చాలా ప్రమాదకరం ఇది సోకితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. వెంటనే ఈ వైరస్ కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. గబ్బిలాల్లో వ్యాపించే వైరస్ అక్కడ నుంచి మనుషులకి సోకిందని తెలిపారు.
ఈ వైరస్ అనేది గబ్బిలాలు ఉండే చోట కనిపిస్తుందని, వాటి దగ్గరకు వెళితే ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.
ఈ కొత్త వైరస్ మనుషులకి సోకిన తర్వాత ఇతరులకు సులువుగా వ్యాపిస్తుందని తెలిపింది. వారు వాడిన వస్తువులు ముట్టుకున్నా ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ఇక వీటి లక్షణాలు చూస్తే తీవ్ర జ్వరం, తలనొప్పి, చికాకు ఉంటాయి.